ఆటోలో నాటు తుపాకులు


శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో నాటు తుపాకులు లభ్యమయ్యాయి. రహదారిలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఆటోలో తరలిస్తున్న 8 నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని పాలకొండ మండలం అన్నవరం గ్రామ శివారులో సోమవారం జరిగింది. పాలకొండ నుంచి అన్నవరం వెళ్తున్న ఆటో ఓ వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.


కాగా డ్రైవర్ అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు ఆటోను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 8నాటు తుపాకులను గుర్తించారు. ఆటోను సీజ్ చేసి, డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని  విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




 

Read also in:
Back to Top