ఏడేళ్ల బాలుడిపై లైంగిక దాడి


ప్రకాశం(కంభం): ఏడేళ్ల చిన్నారిపై ఓ కామాందుడు లైంగిక దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కంభం మండలంలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని తురిమెళ్లలో ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై అదే గ్రామానికి చెందిన రవీంద్ర(19) అనే వ్యక్తి లైంగికంగా దాడికి పాల్పడ్డాడు. బాలుడు కేకలు వేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు కామాందుడు, బాలుడిని వేధించిన చేష్టలు చూసి ఆశ్చర్య పోయారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.




 

Read also in:
Back to Top