తిరుగులేని రాజధాని... ఎదురు లేని రాష్ట్రం

తిరుగులేని రాజధాని... ఎదురు లేని రాష్ట్రం - Sakshi


ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ఆరంభంలోనే విప్లవం

అత్యాధునికమైన, పర్యావరణపరంగా అత్యున్నతమైన, దేశంలోని రాష్ట్రాల రాజధాని నగరాలతో కాకుండా... ప్రపంచంలోని సుందరమైన నగరాలతో పోల్చదగిన, సామాన్యుడికి కూడా చేరువగా ఉండే వరల్డ్ క్లాస్ రాజధాని నగరాన్ని నిర్మించాలనేది జగన్ సంకల్పం. కొత్త రాష్ట్రంలో కొత్తగా నిర్మించబోయే రాజధాని గురించి, రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే అభివృద్ధి గురించి జగన్ ఆవిష్కరించిన ప్రణాళిక ఇదీ...


   పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే.

     కొత్త రాజధానికి-ప్రధాన నగరాలకు మధ్య రేపిడ్ రైల్ ట్రాన్స్‌పోర్ట్ సదుపాయం.

    ఎన్టీపీసీ-బీహెచ్‌ఈఎల్ మన్నవరం ప్రాజెక్టు పూర్తి.

     కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు 8 లేన్ల రోడ్ ట్రాన్స్‌పోర్టు వ్యవస్థ, రైలు మార్గం, బులెట్ ట్రైన్ సదుపాయం.

    విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్.

   అనంతపురం-కృష్ణపట్నం ఇండస్ట్రియల్ కారిడార్.

   పెట్రోలియం, కెమికల్స్, పెట్రో కెమికల్స్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ .

    రాయలసీమ, కోస్తా ఆంధ్రల్లో ఒక్కో చోట ఐటీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్.

    విజయవాడ, విశాఖ, తిరుపతి ఎయిర్‌పోర్టులకు అంతర్జాతీయ స్థాయి.

    ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రైల్వేజోన్.

     విశాఖపట్టణంలో మెట్రో రైలు;  విజయవాడ, గుంటూరు, తెనాలి - మెట్రోపాలిటన్ ఏరియాలో  మెట్రో రైలు.

    దుగ్గరాజపట్నం నౌకాశ్రయం.

    మచిలీపట్నం, వాన్‌పిక్ పోర్టులు.

    800 మెగావాట్ల కృష్ణపట్నం-2 థర్మల్ ప్లాంట్.

   800 మెగావాట్ల వీటీపీఎస్ అయిదో దశ నిర్మాణం.

    960 మెగావాట్ల పోలవరం హైడ్రో పవర్ స్టేషన్.

    1600 మెగావాట్ల వాడరేవు మెగా పవర్‌ప్లాంట్ స్టేజి-1 నిర్మాణం.

    పోలవరంతో పాటుగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వంశధార, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలిగొండ ప్రాజెక్టుల నిర్మాణం.

►   కృష్ణా, గోదావరి, పెన్నా బేసిన్‌లో డ్రైనేజి వ్యవస్థ ఆధునికీకరణ.

►   ప్రతి జిల్లాలోనూ ఆగ్రో ప్రాసెసింగ్ కేంద్రం ఏర్పాటు చేసి,  ప్రాసెసింగ్, గ్రేడింగ్, ప్యాకింగ్, ట్రాన్స్‌పోర్ట్, మార్కెటింగ్ సదుపాయాల ద్వారా వేల కొద్దీ అదనపు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.

►   ఏటా పది లక్షల ఇళ్ళు చొప్పున అయిదేళ్ళలో యాభై లక్షల ఇళ్లు.

►    మునుపటిలా పక్కా ఇంటి నిర్మాణానికి మార్జిన్ మనీ, రుణ భారం లేకుండా, వాటిని రద్దు చేసి... ప్రభుత్వమే ఇళ్ళు కట్టించి, ఇళ్ళ పట్టాలు ఇస్తుంది. బ్యాంకర్లతో మాట్లాడి ఈ ఇల్లే గ్యారంటీగా స్వయం ఉపాధి కోసం రూ.30 వేల వరకు పావలా వడ్డీ రుణం ఇప్పించే ఏర్పాటు.

►  ప్రతి గ్రామ పంచాయతీలోనూ వివిధ సామాజికవర్గాల్లో చదువుకున్న 10మందికి మహిళా పోలీసు ఉద్యోగాలు, తద్వారా సోషల్ ఆడిటింగ్.

►    జిల్లాకో సూపర్ స్పెషాలిటీ, రాజధాని కేంద్రంలో 20 ఫ్యాకల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం ద్వారా భారీగా ఉద్యోగావకాశాలు.

►   104, 108ల విస్తరణ ద్వారా మెరుగైన సేవలు, మరిన్ని ఉద్యోగాలు.

►    రాష్ట్రంలో మూడు వ్యవసాయ విశ్వ విద్యాలయాలు, వాటికి అనుబంధంగా ప్రతి రెండు జిల్లాలకు ఒకటి చొప్పున వ్యవసాయ కళాశాల, పంటల సాగునుబట్టి వ్యవసాయ పరిశోధన కేంద్రాలు, భూసార పరీక్షలు, వ్యవసాయ సూచనల కోసం ఆ కళాశాలలకు అనుబంధంగా మొబైల్ ఆగ్రి క్లినిక్‌లు, మొబైల్ వెటర్నరీ క్లినిక్‌లు.

►    జిల్లాకో విశ్వ విద్యాలయం ఏర్పాటు ద్వారా ఉద్యోగం, ఉపాధి.

 

 ఇంత భారీ ప్రాజెక్టులన్నింటినీ ఒకేసారి చేపట్టటంతో కొత్తగా ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ స్థాయిలో ఆర్థిక వ్యవస్థలో  కదలిక వస్తుంది. నిర్మాణ రంగంలో కూడా భారీ బూమ్ చోటు చేసుకుంటుంది. ఫలితంగా ఆర్థిక వృద్ధిలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. ఒక రంగంలో వేగం మిగతా రంగాల అభివృద్ధి వేగానికి మల్టిప్లయర్ ఎఫెక్ట్ ద్వారా అనేక రెట్లు దోహదపడుతుంది. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి భారీ స్థాయిలో స్టీల్, సిమెంట్ ఉత్పత్తితో పాటుగా కార్మికులు, ఉద్యోగులు అదనంగా అవసరం అవుతారు. ఫలితంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో లక్షల కొద్దీ కొత్త కొలువులు లభిస్తాయి.

 

 స్టీల్, సిమెంటుకు పెరిగే డిమాండ్ సున్నపు రాయి, ఇనుము మైనింగులకు భారీ డిమాండ్‌ను తీసుకువస్తుంది. ఆ రంగంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలూ విసృ్తతం అవుతాయి. వీటన్నింటికీ ముడిపడిన రవాణా రంగంలో కూడా భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. లక్షలాది ఉద్యోగాలకు తద్వారా బాటలు పడి ఇంజనీర్లు, ఐటీ నిపుణులు, ఇతరత్రా ఉద్యోగుల అవసరం ఏర్పడుతుంది. ఈ వైఎస్సార్ కాంగ్రెస్ అభివృద్ధి ప్రణాళికతో మొత్తం ఆర్థిక వ్యవస్థలో, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో విప్లవాత్మక మార్పులు సంభవించి, మిగతా రాష్ట్రాల వారు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూడడం తథ్యం!

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top