పులిమాతల్లి

పులిమాతల్లి


వర్షం పడీపడకుండానే చలికాలంలోకి ప్రవేశిస్తున్నాం. మెక్సికోలోనూ అలాగే ఉన్నట్టుంది పరిస్థితి! అందుకే ఈ పులివేషాలు! మనదగ్గర వానలు కురవాలని ఊరేగింపుగా కప్పతల్లిని మోసుకెళ్లరూ; వీళ్లూ అలాగే! వానలు బాగా పడాలనీ, పంటలు సమృద్ధిగా పండాలనీ చేస్తున్న ఈ సంప్రదాయ ‘టైగ్రాడా పరేడ్’ దృశ్యం అక్కడి గెరీరో రాష్ట్రంలోని చిలాపా ప్రాంతంలోది.

 

 మార్జాల న్యాయం

 పెరూ రాజధాని లిమాలోని మరియా టొరీరో అపార్ట్‌మెంట్ ఇలాగే ఉంటుంది! కాకపోతే, నట్టింట పారాడే పిల్లల్లాంటి పిల్లులు... పాపం, కేన్సర్ బారినపడ్డాయి. ‘ఫెలైన్ లుకేమియా వైరస్’ సోకిన ఈ పిల్లులన్నింటినీ ఆమె తల్లిలాగా సాకుతోంది. కనీసం 175 ఉన్నాయిక్కడ.  వృత్తిరీత్యా నర్సు అయిన మరియా వాటికి తగిన చికిత్స అందిస్తోంది, చిన్న పడకలు ఏర్పాటుచేసింది. పైగా అది తన కనీస బాధ్యత అంటోంది.

 

 చివరి అవసరం

 చనిపోతూ కూడా నవ్వుతున్నట్టుగా ఉందా ఈమెను చూస్తే? అంత్యక్రియలతో ముడిపడిన ఒక అంగడి జరిగింది జపాన్ రాజధాని టోక్యోలో. వృద్ధాప్యం, మరణానంతర క్రతువులకు సంబంధించిన వ్యాపారంలో ఉన్న సుమారు యాభై కంపెనీ లు ఇక్కడ తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. అందులో భాగంగా తమ శవపేటిక ఎంత ‘సౌకర్యంగా’ ఉందో చూపిస్తున్న ఒక సేల్స్‌వుమన్ ఈమె!

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top