వారఫలాలు : 25 సెప్టెంబర్ నుంచి 1అక్టోబర్ 2016 వరకు

వారఫలాలు : 25 సెప్టెంబర్ నుంచి 1అక్టోబర్ 2016 వరకు


మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)

కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు.  కొత్త కాంట్రాక్టులు చేపడతారు. వ్యతిరేకులు సైతం అనుకూలంగా మారతారు. లాభసాటి అవకాశాలతో వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. రాజకీయవర్గాలకు ఉన్నత పదవులు. లేత ఆకుపచ్చ, గులాబీ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

 

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)

కొత్తగా అప్పులు చేస్తారు. బంధువులు,స్నేహితులతో అకారణంగా తగాదాలు. దేవాలయాలు సందర్శిస్తారు. కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. పారిశ్రామికవేత్తలకు చికాకులు పెరుగుతాయి. నేరేడు, లేత ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

 

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

చేపట్టిన కార్యక్రమాలలో విజయం. ఆదాయం పెరుగుతుంది. ఇబ్బందిపెడుతున్న కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇంటర్వ్యూలు అందుతాయి.  భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలలో లాభాలు తథ్యం.  ఉద్యోగులకు ఉన్నత స్థాయి పొందుతారు. కళాకారులకు సన్మానాలు. ఇంటా బయటా ఆనందంగా ఉంటారు. ఆకుపచ్చ, తెలుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

 

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)

అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో మీ సత్తా చాటుకుని అందరిలోనూ గుర్తింపు పొందుతారు. వ్యాపారాలు సాఫీగా లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. రాజకీయవర్గాలకు విదేశీయానం. పసుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

 

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)

నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. పని ఒత్తిడి వల్ల ఆరోగ్యసమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కళాకారులకు అనుకోని అవకాశాలు కలసి వస్తాయి. చాక్లెట్, ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

 

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)

ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. శుభవార్తా శ్రవణం. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. భూసంబంధిత వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం వల్ల కాస్త ఇబ్బంది. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం ఇనుమడిస్తుంది. ఆకుపచ్చ, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

 

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)

ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి. అందరిలోనూ గుర్తింపు. కొన్ని వివాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. స్థలాలు, వాహనాలు కొంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. సోదరుల నుంచి శుభవర్తమానాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.  కళాకారులకు సన్మానాలు. నీలం, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారకస్తోత్రం పఠించండి.

 

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)

అనుకున్న ఆదాయం సమకూరుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొన్ని వివాదాల పరిష్కారం. కుటుంబంలో శుభకార్యాలు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు పట్టింది బంగారమే. పసుపు, గులాబీరంగులు,  దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. వినాయకుని పూజించండి.

 

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

వ్యవహారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. బంధువులతో విభేదాలు తలెత్తవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమాధిక్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం వల్ల మానసిక ఒత్తిడి తప్పదు.  రాజకీయవర్గాలకు కొన్ని అవకాశాలు చేజారతాయి. గులాబీ, లేత ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

 

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)

ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు సామరస్యంగా సమసిపోతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్వల్ప అనారోగ్యం. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అభివృద్ధిపథంలో సాగుతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. నలుపు, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి.

 

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)

విద్యార్థుల యత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. భూవివాదాల నుంచి గట్టెక్కుతారు. అనూహ్యంగా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వాహనయోగం. వ్యాపారవృద్ధి. యత్నకార్య సిద్ధి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. కళాకారులకు సన్మానాలు. నీలం, లేత పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.

 

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)

అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక విషయాలు కొంత నిరాశ కలిగించినా అవసరాలు తీరతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సోదరులతో మనస్పర్థలు తొలగుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా పడే సూచనలు ఉన్నాయి. తెలుపు, ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top