వారఫలాలు : 18 జూన్‌ నుంచి 24 జూన్‌ 2017 వరకు

వారఫలాలు : 18 జూన్‌ నుంచి 24 జూన్‌ 2017 వరకు


మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)

ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. శత్రువుల్ని కూడా మిత్రులుగా మార్చుకుంటారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు. పారిశ్రామికవర్గాలకు అనూహ్యమైన అవకాశాలు. పసుపు, లేత ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.



వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)

వీరికి పట్టింది బంగారమే. అయితే పనుల్లో జాప్యం తప్పకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఇంటాబయటా అనుకూల పరిస్థితి. వ్యాపార లావాదేవీలు మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగస్తులకు గుర్తింపు. రాజకీయవర్గాల శ్రమ ఫలిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. నీలం, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.



మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

ఎంతటి వారినైనా వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. ప్రముఖుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. కొన్ని సమస్యలు ఓర్పుగా పరిష్కరించుకుంటారు. వాహనాలు, భూముల కొనుగోలు యత్నాలలో కదలికలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. కళాకారులకు పురస్కారాలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. బంధువిరోధాలు. పసుపు, బంగారు రంగులు,  పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.



కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)

అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకం. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. కొన్ని పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు.నేరేడు, తెలుపు రంగులు,  ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణు«ధ్యానం చేయండి.



సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)

ప్రారంభంలో కొద్దిపాటి సమస్యలు తప్పవు. ఆర్థిక విషయాలు కాస్త ఊరట కలిగిస్తాయి. బంధువర్గంతో ఆస్తుల వ్యవహారాలు పరిష్కరించుlకుంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు. సంఘంలో విశేష గౌరవం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మ«ధ్యలో ధనవ్యయం. ఎరుపు, గులాబీ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.



కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)

కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. పనుల్లో ఆటంకాలను అధిగమిస్తారు. రాబడి ఆశాజనకం. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి పెంచుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు తగ్గుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ఆరోగ్యభంగం. మిత్రులతో కలహాలు. ఆకుపచ్చ, లేతనీలం రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.



తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)

కొత్త విషయాలు తెలుసుకుంటారు. అనుకున్న కార్యాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ అంచనాలు నిజమవుతాయి. ఆర్థిక పరిస్థితిలో గందరగోళం తొలగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. గులాబీ, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.



వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)

మీ ఊహలు నిజమవుతాయి. ఆర్థిక విషయాలలో పురోగతి. శ్రమ ఫలిస్తుంది. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగుల కలలు ఫలించే సమయం. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు. ఉద్యోగవర్గాలకు అనుకూల మార్పులు. కళాకారులకు ప్రయత్నాలు సఫలం. వారం చివరిలో ధనవ్యయం. పసుపు, లేత గులాబీ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.



ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయంతో పనులు చక్కదిద్దుతారు. కుటుంబంలో శుభకార్యాలు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు అనుకూల సమయం. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. గులాబీ, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.



మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)

చేపట్టిన కార్యక్రమాలు కొంత నెమ్మదించినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలలో చికాకులు తొలగుతాయి. భూవివాదాలు పరిష్కారమవుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు. రాజకీయవర్గాలకు ఒత్తిడులు తొలగుతాయి. వారం మధ్యలో ఖర్చులు. కుటుంబంలో కొద్దిపాటి వివాదాలు. నీలం, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.



కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)

ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు. ఆలోచనలు నిలకడగా ఉండవు. పనుల్లో అవాంతరాలు. బంధువులతో అకారణంగా తగాదాలు. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరం. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప ధనలాభం. కార్యసిద్ధి. ఆకుపచ్చ, లేత గులాబీ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.



మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)

అప్రయత్న కార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు అనుకూలం. ఆదాయం ఆశాజనకం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకు సత్కారాలు. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. శ్రమాధిక్యం. పసుపు, తెలుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ను పూజించండి.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top