వారఫలాలు : 11 జూన్‌ నుంచి 17 జూన్‌ 2017 వరకు

వారఫలాలు : 11 జూన్‌ నుంచి 17 జూన్‌ 2017 వరకు


మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)

ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. భూవివాదాలు పరిష్కారమవుతాయి. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఇంటాబయటా అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారస్తులకు ఊహించని విధంగా లాభాలు. ఉద్యోగవర్గాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకు సన్మానాలు. బంధువిరోధాలు. గులాబీ, లేత పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీకృష్ణస్తోత్రాలు పఠించండి.



వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోణి, మృగశిర 1,2 పా.)

ఆర్థిక లావాదేవీలు మొదట్లో కొంత ఇబ్బంది కలిగిస్తాయి. అయితే క్రమేపీ అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. పట్టుదలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు ఊహించని పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, నీలం రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారా స్తోత్రాలు పఠించండి.



మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

కొన్ని వివాదాలు, సమస్యలు ఎదురైనా సర్దుబాటు చేసుకుంటారు. పనులు కొంత నెమ్మదిస్తాయి. విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటారు. ఇంటిలో శుభకార్యాలపై చర్చలు. ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి. కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. వారం మధ్యలో దుబారా ఖర్చులు. మానసిక అశాంతి. ఎరుపు, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.



కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)

విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం అందుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపార లావాదేవీలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతపోస్టులు. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. పసుపు, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.



సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)

పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. స్థిరాస్తి వృద్ధి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వస్తు, వస్త్రలాభాలు. వాహనయోగం. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. వ్యాపారులకు ఒత్తిడులు తగ్గే సూచనలు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. కళాకారులకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం. ఒత్తిడులు. ఎరుపు, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.



కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)

కొన్ని వ్యవహారాలు నెమ్మదిస్తాయి. అనుకున్న లక్ష్యాల సాధనలో కొంత పురోగతి ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు కొలిక్కి వస్తాయి. సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. కొన్ని ఇబ్బందులు తీరే అవకాశం. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు అనూహ్యమైన ప్రశంసలు అందుతాయి. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు తొలగుతాయి. వారం ప్రారంభంలో దుబారా ఖర్చులు. వ్యయప్రయాసలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.



తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)

అనుకున్న రాబడి దక్కి ఉత్సాహంగా గడుపుతారు. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. హోదాలలో ఉన్న వ్యక్తులు సహకరిస్తారు. విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. వాహన, గృహయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకు కార్యసిద్ధి. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. నేరేడు, తేనెరంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.



వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఆదాయానికి మించిన ఖర్చులు, తద్వారా అప్పులు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. సోదరులు, మిత్రుల నుంచి ఒత్తిళ్లు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు మందకొడిగానే ఉంటాయి. ఉద్యోగులకు పనిభార ం పెరుగుతుంది. రాజకీయవర్గాలకు ఒడిదుడుకులు. వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప ధనలాభం. ఎరుపు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.



ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

వీరికి అన్ని విధాలా అనుకూల సమయం. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. ఆలయాలు సందర్శిస్తారు.  విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. కళాకారులకు అవార్డులు లేదా పురస్కారాలు. వారం చివరిలో ధనవ్యయం. మానసిక ఆందోళన. గులాబీ, ఆకుపచ్చరంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది.



మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)

కొత్త వ్యక్తులు పరిచయం కాగలరు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి కోరుకున్న సాయం అందుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. సోదరులు, సోదరీల నుంచి శుభవార్తలు అందుతాయి.వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. రాజకీయవర్గాలకు పదవులు వరించే అవకాశం. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో వివాదాలు. నలుపు, లేత పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.



కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)

కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగస్తులకు అనుకున్న హోదాలు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో వృథా ఖర్చులు. ఆరోగ్య సమస్యలు. నీలం, లేత ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.



మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదాయం పెరిగి రుణవిముక్తి పొందుతారు. చేపట్టిన కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వారం మధ్యలో వివాదాలు. శ్రమాధిక్యం. గులాబీ, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top