వారఫలాలు : 27 నవంబర్ నుంచి 3 డిసెంబర్ 2016 వరకు

వారఫలాలు :  27 నవంబర్ నుంచి 3 డిసెంబర్ 2016 వరకు

 మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)

 ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగించినా అవసరాలు తీర తాయి. కొన్ని ఇబ్బందులు తీరి ఉపశమనం పొందుతారు. సోదరులు, సోదరీలతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో నూతనోత్సాహం. ఉద్యోగులకు కొంత ఊరట లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఎరుపు, పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

 

 వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)

  పనులు సజావుగా సాగుతాయి. ఆప్తులు సహాయ పడతారు. ఆదాయానికి లోటు ఉండదు. ఆరోగ్యం మందగిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఒక సమాచారం కొంత నిరాశ కలిగించవచ్చు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. నీలం, చాక్లెట్ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

 

 మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

 పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, సోదరులతో సఖ్యత నెలకొంటుంది. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. కళాకారులకు ఒత్తిడులు తొలగుతాయి. తెలుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిస్తోత్రాలు పఠించండి. 

 

 కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)

 ప్రారంభంలో కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. శ్రమానంతరం పనులు పూర్తి కాగలవు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సోదరుల నుంచి ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక సంతోషం కలిగిస్తుంది. నిరుద్యోగులకు సంతోషకరమైన సమాచారం. వ్యాపారాలలో అధిక లాభాలు. ఉద్యోగులకు పైస్థాయి వారి ద్వారా సాయం అందుతుంది. పారిశ్రామికవర్గాలకు సన్మానయోగం. లేత ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోత్రాలు పఠించండి.

 

 సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)

 అనుకున్న పనుల్లో కొంత జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు.  ఆశించిన లక్ష్యాలను అవలీలగా సాధిస్తారు. ఆత్మీయుల ఆదరణ, ప్రశంసలు పొందుతారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం. ఒక సమస్యను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకు అవార్డులు దక్కవచ్చు. గులాబీ, లేత ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

 

 కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)

 ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. సోదరులు, మిత్రులతో అకారణంగా విభేదాలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. రాజకీయవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. ఆకుపచ్చ, నీలం రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

 

 తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)

 కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రముఖుల నుంచి కీలక సందేశం. విలువైన సమాచారం అందుతుంది. సోదరులు, సోదరీలతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమా లలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామికవర్గాలకు అరుదైన సత్కారాలు. నేరేడు, ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి.

 

 వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)

 కొత్త వ్యూహాలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. గతంలో చేజారిన వస్తువులు దక్కించుకుంటారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఊహించని  పదోన్నతులు. రాజకీయవర్గాలకు పదవులు దగ్గరకు వస్తాయి. ఎరుపు, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవిని పూజించండి.

 

 ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

 ఆశించిన రాబడి దక్కుతుంది. సోదరులతో నెలకొన్న విభేదాలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పోటీపరీక్షల్లో నిరుద్యోగులకు విజయం. వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. గులాబీ, తెలుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

 

 మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)

 కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. విద్యార్థులకు కొత్త ఆశలు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. ఆస్తుల వివాదాలు తీరి ఊరట చెందుతారు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు సమస్యలు తీరతాయి. కళాకారులకు పురస్కారాలు అందుతాయి. తెలుపు, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీహనుమాన్ చాలీసా పఠించండి.

 

 కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)

 కొన్ని పనులు నిదానంగా పూర్తి కాగలవు. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఒక సంతోషకరమైన వార్త అందుతుంది. రాజకీయవర్గాలకు హోదాలు దక్కుతాయి. కళాకారులకు సన్మానాలు. నలుపు, నేరేడు రంగులు, లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

 

 మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)

 ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ఆరోగ్యపరంగా స్వల్ప చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సజావుగానే సాగుతాయి. ఉద్యోగులకు విధుల్లో అవరోధాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఎరుపు, చాక్లెట్ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

 
Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top