వారఫలాలు : 25 జూన్‌ నుంచి 1 జూలై 2017 వరకు

వారఫలాలు : 25 జూన్‌ నుంచి 1 జూలై 2017 వరకు


మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)

మీ అంచనాలు నిజమై ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వివాహæప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యపరంగా చికాకులు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు పైస్థాయి ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. పసుపు, గులాబీ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.



వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోణి, మృగశిర 1,2 పా.)

చేపట్టిన కార్యక్రమాలు కొంత మందకొడిగా సాగుతాయి. రావలసిన సొమ్ము సకాలంలో అందక ఇబ్బంది పడతారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపండి. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. వ్యాపార లావాదేవీలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడులు. కళాకారులకు కొంత నిరాశ తప్పదు. వారం మధ్యలో శుభవార్తలు. సంఘంలో గౌరవం. ఆకుపచ్చ, లేత నీలం రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయ దర్శనాలు చేసుకోండి.



మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి కాగలదు. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఉత్సాహంగా గడుపుతారు. వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి.తోబుట్టువులతో సంతోషంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామిక వర్గాలకు అనుకూల సమాచారం అందుతుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు.  అనారోగ్యం. గులాబీ, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.



కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)

ముఖ్య కార్యక్రమాలు సకాలంలో పూర్తి కాగలవు. రావలసిన సొమ్ము అంది ఊరట చెందుతారు. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. కొన్ని ముఖ్య ఒప్పందాలు కుదురుతాయి. పరిచయాలు పెరుగుతాయి. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వాహనయోగం. వివాహాది శుభకార్యాల నిర్వహణపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వారం ప్రారంభంలో ఖర్చులు. మానసిక అశాంతి. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి. శివపంచాక్షరి పఠించండి.



సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)

బంధువులు, మిత్రులతో నెలకొన్న వివాదాలు పరిష్కారమవుతాయి. మీ ప్రతిభ చాటుకునేందుకు తగిన సమయం. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్య నుంచి బయటపడతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు అందుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో వృథా ఖర్చులు. బంధువిరోధాలు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.



కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా.)

అన్ని విషయాలలోనూ ఉత్సాహంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి.  నూతన వ్యక్తులతో పరిచయం. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. మీమాటకు ఎదురుండదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు నూతనోత్సాహం. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఆకుపచ్చ, పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.



తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)

రాబడి ఆశాజనకంగా ఉంటుంది. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యవహారాలలో విజయం. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు.  వాహనయోగం. పలుకుబడి కలిగిన వారితో చర్చలు జరుపుతారు. నూతన ఉద్యోగయోగం. వ్యాపార వృద్ధి. రాజకీయవర్గాలకు పదవులు వరిస్తాయి. వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు. స్వల్ప అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.



వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)

బంధువర్గంతో విభేదాలు తొలగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వివాదాలు. ఆరోగ్యభంగం. ఎరుపు, పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.



ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలోనే పూర్తి కాగలవు. పోటీ æపరీక్షలలో విజయం సాధిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. కళాకారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. గులాబీ, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.



మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)

 ప్రముఖులతో పరిచయాలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కలసివచ్చే సమయం. వ్యాపారాలలో ఆటుపోట్లు అధిగమిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. నలుపు, లేత నీలం రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయస్వామిని పూజించండి.



కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)

ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగ సూచనలు. వారం మధ్యలో ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. లేత ఎరుపు, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. లక్షీస్తుతి మంచిది.



మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)

దీర్ఘకాలిక నిరీక్షణ ఫలిస్తుంది. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక ప్రగతి ఉంటుంది. రావలసిన సొమ్ము అందుతుంది. విద్యార్థుల కలలు ఫలిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. కాంట్రాక్టర్లకు విశేషంగా రాణిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు తథ్యం. కళాకారులకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. కుటుంబసమస్యలు. గులాబీ, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీగణపతి స్తోత్రాలు పఠించండి.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top