వారఫలాలు :19 మార్చి నుంచి 25 మార్చి 2017 వరకు

వారఫలాలు :19 మార్చి నుంచి 25 మార్చి 2017 వరకు


మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)

లక్ష్యాలను సాధించేందుకు కొంత శ్రమపడాల్సిన సమయం. ఆర్థిక పరిస్థితి క్రమేపీ మెరుగుపడుతుంది. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపండి.  వ్యాపార లావాదేవీలు కాస్త పుంజుకుంటాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో వృథా ఖర్చులు. బంధువిరోధాలు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిని పూజించండి.



వృషభం: (కృత్తిక 2,3,4 పా, రో ణి, మృగశిర 1,2 పా.)

 ఆదాయం కొంత తగ్గినా అవసరాలకు సొమ్ము అందుతుంది.  విద్యార్థుల యత్నాలు సఫలం. ఆస్తి వివాదాలు కొంతమేరకు పరిష్కారం. శుభవార్తలు అందుతాయి.  వ్యాపారాలు అభివృది ్ధదిశగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఆశించిన పదోన్నతులు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు తథ్యం. వారం మధ్యలో వివాదాలు. ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు సానుకూలం. శివస్తోత్రాలు పఠించండి.



మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

 ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రావలసిన సొమ్ము సైతం అందుతుంది.  ముఖ్య నిర్ణయాలలో లోపాలను సరిదిద్దుకుంటారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు తొలగుతాయి. ఉద్యోగలాభం. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు సన్మానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో స్వల్ప వివాదాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.



కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)

కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు అవకాశాలు దక్కుతాయి. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులు సమర్థతను నిరూపించుకుంటారు. కళాకారులకు శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పసుపు, లేత ఎరుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.



సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)

ఆలోచనలు అమలు చేస్తారు. వేధించిన సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. భూవివాదాలు తీరతాయి. ఆదాయం సంతృప్తినిస్తుంది. ఇంటాబయటా ఒత్తిడులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగస్తులకు ఆశించిన పదోన్నతులు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం  చివరిలో ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.



కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)

కొంత జాప్యం జరిగినా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంతవరకూ అనుకూలిస్తుంది. విద్యార్థుల ప్రతిభ నిరూపించుకుంటారు. ఆస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం మధ్యలో వ్యయప్రయాసలు. పనిఒత్తిడులు. గులాబీ, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.



తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)

ఆర్థిక ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆలోచనలు నిలకడగా ఉండవు. సోదరులు, సోదరీలతో విభేదాలు. పనులు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు నిరాశాజనకంగా ఉంటుంది. మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. వారం మధ్యలో శుభవార్తలు. ధనలాభం. నీలం, లేత ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.



వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఎంతటి కార్యాన్నైనా విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆదాయం సంతృప్తినిస్తుంది. రావలసిన సొమ్ము అందుతుంది. వివాహ వేడుకల్లో పాల్గొంటారు. గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. ఎరుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.



ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులకు నూతనోత్సాహం. ముఖ్య సమాచారం అందుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు అప్రయత్న కార్యసిద్ధి.  వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. గులాబీ, లేత పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి.



మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)

ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు శుభవార్తలు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో వివాదాలు. అనారోగ్యం. నీలం, నేరేడురంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.



కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)

వీరికి పట్టింది బంగారమే అన్నట్టుంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. రాబడి పెరుగుతుంది. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు మంచి గుర్తింప. కళాకారులకు అవార్డులు. నలుపు, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.



మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)

ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. జీవిత భాగస్వామి నుంచి ఆస్తిలాభం ఉండవచ్చు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. కళాకారులకు సన్మానయోగం. వారం మధ్యలో వ్యయప్రయాసలు. గులాబీ, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ స్తోత్రాలు పఠించండి.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top