టారో : 18 జూన్‌ నుంచి 24 జూన్‌ 2017 వరకు

టారో : 18 జూన్‌ నుంచి 24 జూన్‌ 2017 వరకు


మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)

కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. సంపదను పెంచుకుంటారు. విలాసాలను ఆస్వాదిస్తారు. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉన్నప్పటికీ, నిరాశా నిస్పృహలు వెన్నాడుతాయి.  సవాళ్లను, ఒడిదుడుకులను దాటి ఆలోచించడం మంచిది. కష్టాలకు చలించకుండా సాగితేనే జీవితంలోని ఆనందాన్ని ఆస్వాదించగలరు.

కలిసొచ్చే రంగు: ఎరుపు



వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)

సంయమనమే మూలమంత్రంగా ముందుకు సాగుతారు. పని ఒత్తిడిలో తలమునకలవుతారు. ప్రేమ సాఫల్యం కోసం మీ ప్రేమికులతో మరింత కాలాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. ప్రయాణాలకు, విద్య, వృత్తి, ఉద్యోగాల్లో పురోగతికి సానుకూలమైన కాలం. జీవితంలో మెరుగుపరచుకోవాల్సిన అంశాలను మెరుగుపరచుకుంటారు.

కలిసొచ్చే రంగు: గోధుమ



మిథునం (మే 21 – జూన్‌ 20)

ఒక గొప్ప అవకాశం తలుపు తడుతుంది. మీరు తీసుకునే కీలక నిర్ణయం మిమ్మల్ని విజయాల బాట వైపు నడిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు అద్భుతంగా ఉంటాయి. అయితే, మీకంటూ సమయం మిగలని పరిస్థితులు ఉంటాయి. గొప్ప లక్ష్యంతో ప్రారంభించే పనులు అద్భుత విజయాలను అందిస్తాయి.

కలిసొచ్చే రంగు: ముదురు నారింజ



కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)

ఇప్పటికే చాలా ఘనవిజయాలను అందుకుని ఉంటారు. మిమ్మల్ని మీరు విజేతగా భావిస్తారు. మీ విజయాలను ఏ శక్తీ ఆపలేదు. ఆర్థికంగా ఇది అద్భుతమైన కాలం.  కొత్త కార్యాచరణను ప్రారంభిస్తారు. శ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు. ఆత్మబంధువు ఒకరు తారసపడతారు. ఈ బంధం వ్యక్తిగత స్థాయి నుంచి ఆధ్యాత్మికత వైపు ప్రయాణిస్తుంది.

కలిసొచ్చే రంగు:  తుప్పు రంగు



సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)

ప్రేమ వ్యవహారాల్లో కీలక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. కొత్త కొత్త సంతోషాలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. అలాగని పని పట్ల మీ ప్రాధాన్యం ఏమాత్రం తగ్గదు. శరీరాన్ని తీర్చిదిద్దుకోవడానికి కఠినమైన ఆరోగ్య నియమాలను పాటిస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

కలిసొచ్చే రంగు: తెలుపు



కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)

ఇంటి పునర్నవీకరణకు తగిన సమయం ఇది. చిరకాలంగా వాయిదా పడుతూ వస్తున్న పనిని పూర్తి చేస్తారు. పనిలో ఎదురవుతున్న ఇబ్బందులు పరిష్కారమవుతాయి. ఆదాయ వ్యయాలకు, పనికి కాలక్షేపానికి మధ్య సమతుల్యతను పాటించాల్సి ఉంటుంది. సహోద్యోగులతో సర్దుబాటు ధోరణి అవలంబించాల్సి వస్తుంది.  

కలిసొచ్చే రంగు: ఊదా



తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)

చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. తీరిక లేని పరిస్థితి ఉంటుంది. ఒక నిజం తెలుసుకుని దిగ్భ్రాంతులవుతారు. కాలమే అన్ని గాయాలనూ మాన్పుతుందని గ్రహిస్తారు. ఇతరులకు దూర గా గిరి గీసుకుని ఉండే ధోరణికి స్వస్తిపలకడం మంచిది. పనిలో సత్ఫలితాలు సాధిస్తారు.

కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ



వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)

చేసే పనిలో పూర్తిగా నిమగ్నమవుతారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ఒంటరి వారికి వివాహ యోగం. స్థిరాస్తి వ్యాపారులకు ఆర్థిక లాభాలు ఉంటాయి. కుటుంబ వ్యాపారంలో గొప్ప పేరుప్రతిష్టలు సాధిస్తారు. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ అవసరమవుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది.

కలిసొచ్చే రంగు: పసుపు


ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)

జీవితంలో చీకట్లు తొలగి వెలుగురేకలు కనిపిస్తాయి. కొత్త ఆశలు చిగురిస్తాయి.  కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, కొత్త భాగస్వాములతో ఒప్పందాలకు అనుకూలమైన కాలం. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. మనశ్శరీరాల సాంత్వనకోసం యోగాను ఆశ్రయిస్తారు.

కలిసొచ్చే రంగు: వెండి



మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)

వృత్తి ఉద్యోగాల్లోను, వ్యక్తిగత అనుబంధాల్లోను మీ దృఢ సంకల్పాన్ని, ధైర్యాన్ని నిరూపించుకుంటారు. కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. పాత పద్ధతులకు తిలోదకాలిచ్చి కొత్త మార్పులకు శ్రీకారం చుడతారు. పాత బాకీలను తీర్చేస్తారు. చదువుపై మరింతగా దృష్టి సారిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో పోటీ ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి..

కలిసొచ్చే రంగు: లేత ఆకుపచ్చ



కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)

మందకొడిగా, బద్ధకంగా గడుపుతారు. ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతారు. ఇదివరకటి పెట్టుబడులపై లాభాలు అందుకుంటారు. ఇంట్లోను, కార్యాలయంలోను మొక్కలు నాటడం ద్వారా ఉత్సాహభరితమైన వాతావరణం ఏర్పాటు చేసుకుంటారు. అదృష్టం మీవైపే ఉంటుంది.

కలిసొచ్చే రంగు: నారింజ



మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)

ప్రేమ వ్యవహారాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒంటరి వారికి పెళ్లి జరిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత వహించాల్సి వస్తుంది. చేటు చేసే పాత అలవాట్లను మానుకుని కొత్తగా మంచి అలవాట్లను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తారు. వ్యసనాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది.

కలిసొచ్చే రంగు: నీలం

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top