టారో : 23 అక్టోబర్ నుంచి 29 అక్టోబర్, 2016 వరకు

టారో :  23 అక్టోబర్ నుంచి 29 అక్టోబర్, 2016 వరకు


మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19)

 అడుగడుగునా గందరగోళాలు, అపార్థాలు ఎదురవుతాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి బయటపడతారు. వాక్చాతుర్యంతో సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన ప్రాజెక్టును ప్రారంభిస్తారు. విజయపథంలోకి అడుగుపెడతారు. ప్రేమ వ్యవహారాల్లో పొరపొచ్చాల కారణంగా మనస్తాపానికి లోనవుతారు.

 లక్కీ కలర్: తెలుపు

 

 వృషభం (ఏప్రిల్ 20 - మే 20)

 వృత్తి ఉద్యోగాల్లో సుస్థిరతను సాధిస్తారు. ప్రతిభా పాటవాలతో మరిన్ని అధికారాలను, ఉన్నత పదవులను దక్కించుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. చిరకాలంగా కొనసాగుతున్న ఆస్తి తగాదాలను సానుకూలంగా పరిష్కరించుకుంటారు. ప్రేమ వ్యవహారాలకు సంబంధించి ఆత్మవిమర్శలో పడతారు.

 లక్కీ కలర్: నీలం

 

 మిథునం (మే 21 - జూన్ 20)

 ఇంటా బయటా మార్పులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఇంట్లోను, కార్యాలయంలోను కొత్త అలంకరణలు, హంగులు ఏర్పాటు చేసుకుంటారు. ఊహాలోకంలో తేలియాడతారు. మార్మిక జగత్తును అర్థం చేసుకోవడానికి ఉన్నత దృక్పథం అవసరమని గ్రహిస్తారు. అదృష్టం వెన్నంటి ఉండటంతో సమస్యలను సునాయాసంగా అధిగమిస్తారు. పిల్లల ద్వారా సంతోషం పొందుతారు.

 లక్కీ కలర్: ఎరుపు

 

 కర్కాటకం (జూన్ 21 - జూలై 22)

 మీ వెన్నంటి ఉంటే దైవశక్తి ప్రభావంతో కుటుంబ సమస్యల నుంచి సునాయాసంగా బయటపడతారు. వృత్తి ఉద్యోగాల్లోని అవరోధాలను అధిగమిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఆహ్లాదభరితంగా సాగుతాయి. ఒక వినూత్న అనుభవం మీలో పరివర్తనకు దారితీస్తుంది. కీలకమైన బాధ్యతలతో పని ఒత్తిడి పెరుగుతుంది. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు.

 లక్కీ కలర్: నారింజ

 

 సింహం (జూలై 23 - ఆగస్ట్ 22)

 ఆర్థిక లావాదేవీలు, అధికారిక వ్యవహారాలకు సంబంధించి తుది నిర్ణయాలు తీసుకోవలసిన సమయంలో గందరగోళానికి లోనవుతారు. ‘ఆలస్యం అమృతం విషం’. అందువల్ల తటపటాయింపులు, తర్జనభర్జనలు లేకుండా నిర్ణయాలు తీసుకోవడమే మంచిది. విధి నిర్వహణ పట్ల స్పష్టతతో ఉంటారు. ఇతరుల సలహాల పట్ల అప్రమత్తంగా ఉండటం క్షేమం.

 లక్కీ కలర్: పసుపు

 

 కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22)

 వృత్తి ఉద్యోగాల్లోని పురోగతి సంతృప్తికరంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. అనూహ్యంగా ప్రత్యర్థి సంస్థ నుంచి లభించే ఉద్యోగావకాశం మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. కొత్త మిత్రులు పరిచయమవుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాల్సి వస్తుంది.

 లక్కీ కలర్: ఆకుపచ్చ

 

 తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)

 పరిస్థితులపై పోరాటం చేయాల్సి వస్తుంది. ఆగ్రహంతో కాకుండా ఆత్మవిశ్వాసంతో ఇబ్బందికరమైన పరిస్థితులను అధిగమిస్తారు. కాలం పెట్టే పరీక్షలను అత్యంత సహనంతో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతి పనిలోనూ ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. మిత్రులతో వాగ్వాదాలు మనస్తాపం కలిగిస్తాయి. మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు వ్యాయామం లేదా క్రీడలపై దృష్టి పెడతారు.

 లక్కీ కలర్: ముదురాకుపచ్చ

 

 వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21)

 ఆలోచన లేని చర్యలతో ప్రమాదాలను కొనితెచ్చుకుంటారు. తలపెట్టిన కొత్తపనులను వీలైనంత త్వరగా ప్రారంభించాలనుకుంటారు. జాప్యం ఎదురవడంతో సహనం కోల్పోతారు. ఒక ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారమవుతుంది. సన్నిహితులతో కలసి వ్యాపారాలు ప్రారంభిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో కొత్తదనం కోసం పాకులాడుతారు. సుదూర విహారయాత్రలకు వెళతారు.

 లక్కీ కలర్: నేరేడు

 

 ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)

 ఏ దిశలో పయనించాలనే దానిపై మీకు తిరుగులేని స్పష్టత ఉంటుంది. వ్యాపారంలో సవాలుగా నిలిచే అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చొరవతో పూనుకొని ఆస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో సాహసోపేతంగా వ్యవహరిస్తారు. భావోద్వేగాలను అదుపు చేసుకుని, సంయమనంతో గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కుతారు.

 లక్కీ కలర్: తుప్పు రంగు

 

 మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)

 ఆచితూచి అడుగు ముందుకేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. నిరంతర అప్రమత్తతే మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది. ఇదివరకటి కంటే జీవితంలో వేగం కాస్త తగ్గుతుంది. పనిభారం తగ్గి కాస్త తీరిక దొరుకుతుంది. అధ్యయన కాంక్షతో పుస్తక పఠనం కొనసాగిస్తారు. ఇంటిని అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దుకుంటారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు.

 లక్కీ కలర్: వెండి రంగు

 

 కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18)

 ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతమవుతాయి. కొత్త ఆలోచనలను ఆచరణలోకి తెస్తారు. మీ కుటుంబంలోకి కొత్త అతిథి రావచ్చు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వారితో సందడి సందడిగా గడుపుతారు. ఒక శుభవార్త అమితానందం కలిగిస్తుంది. ప్రేమికుల మధ్య బంధం బలపడుతుంది. ఇతరులు ఇచ్చే సలహాల పట్ల అప్రమత్తంగా ఉండటం క్షేమం.

 లక్కీ కలర్: ఆకుపచ్చ

 

 మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)

 అందరి దృష్టినీ ఆకర్షిస్తారు. మీ చుట్టూ జనాలు చేరుతారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభను చాటుకుంటారు. ఇదివరకటి పనులకు తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు. కుటుంబ సభ్యుల నుంచి అద్భుతమైన సహకారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు సంతోషభరితంగా సాగుతాయి. ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. విందులు, వినోద కార్యక్రమాల్లో మునిగి తేలుతారు.

 లక్కీ కలర్: ముదురు పసుపు

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top