భర్తకు న్యాయం చేయగలనా?

భర్తకు న్యాయం చేయగలనా?


  జీవన గమనం

  పద్దెనిమిదేళ్ల వయసులో నాకొక స్నేహితు డుండేవాడు. ఆరేళ్ల పాటు ప్రేమించిన తర్వాత అతడు వేరే వివాహం చేసుకున్నాడు. నాకు బాగా దుఃఖం కలిగింది. అతడి మరో స్నేహి తుడు ఓదార్చాడు. పాత స్నేహితుడి మీద కసితో ఈ రెండో వ్యక్తికి దగ్గరయ్యాను. అతడు వివాహితుడు. ఆ విషయం నాకు చెప్పలేదు. ఒకరికి మనసు, ఒకరికి శరీరం అర్పించిన నేను భవిష్యత్తులో నా భర్తకు ఏవిధంగా న్యాయం చేయగలను?

 - రచన, గుంటూరు

 మనం బాగా నమ్మినవాడు మనసు గాయపరిచి వెళ్లిపోతే, ఆ షాక్‌ని మూడో మనిషి దగ్గర వెలిబుచ్చుకోవాలనుకోవడం సహజం. సాధారణంగా ఈ సందర్భంలో మన బాధ వెలిబుచ్చు కోవడానికి ‘ఇద్దరికీ తెలిసిన వ్యక్తి’ని ఎన్నుకుంటాం. కానీ ఎప్పుడైతే మనం మన రహస్యాలని మూడో వ్యక్తికి చెప్పామో, దాన్ని క్యాష్ చేసుకోవడానికి అవకాశాలు చాలా ఉంటాయి. అయిపోయిందేదో అయి పోయింది. ఒక్క విషయం గుర్తుపెట్టు కోండి. జీవితాన్ని ఎప్పుడంటే అప్పుడు ఫ్రెష్‌గా ప్రారంభించొచ్చు. మీ భర్తకి న్యాయం జరుగుతుందా లేదా అనేది, వివాహానంతరం మీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది తప్ప వివాహ త్పూర్వ అనుభవంపై కాదు. వీలైనంతవరకూ గత అనుభవాల్ని స్మృతిపథం లోంచి చెరిపేయండి. సంతో షంగా ఎలా ఉండాలో కాలమే మీకు నేర్పుతుంది.

 

 నేనొక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తు న్నాను. ఎఫీషియెంట్ వర్కర్‌గా పేరుంది. అయితే చుట్టూ ఉన్నవాళ్లతోనే సమస్య. నేను అందరితోనూ ప్రేమగానే ఉంటాను. ఎవరికేం సాయం కావాలన్నా చేస్తూంటాను. వాళ్లు కూడా బాగానే ఉన్నట్టు కనిపిస్తారు. కానీ ఎప్పుడైనా నన్ను మా బాస్ ప్రశంసిస్తే వాళ్లలో మార్పు వచ్చేస్తుంది. నాతో సరిగ్గా మాట్లాడరు. నన్ను వేరు చేసి వాళ్లంతా ఒక్కటైపోతారు. దానికి తోడు ఈ మధ్య నా గురించి నెగిటివ్ కామెంట్లు కూడా చేస్తున్నారని నా ఫ్రెండ్ ద్వారా తెలిసింది. ఎందుకిలా చేస్తున్నారు? లోపం నాలో ఉందా వారిలోనా?

 - సుదీప్, బెంగళూరు

 ‘మంచి స్నేహితులు మిమ్మల్ని ఎప్పుడూ వదిలేయరు. మిమ్మల్ని వదిలేసినవారు మంచి స్నేహితులు కారు. అటువంటి వారు మిమ్మల్ని వదిలేసి నందుకు అదృష్టవంతులనుకోండి’ అని ఇటీవలే ‘ప్రేమ ఒక కళ’(సాక్షి ఫన్‌డే వ్యాసాల సంపుటి) అనే ప్తుకంలో రాశాను. బాగా పనిచేసేవాడికీ, అంచెలంచెలుగా ఎదుగుతున్న వ్యక్తికీ ఏ సంస్థలోనైనా స్నేహితుల కన్నా ఈర్ష్య పడేవారే ఎక్కువుంటారు. ‘నీ గురించి ఆఫీసులో అందరూ ఏమనుకుంటున్నారో తెలుసా’ అనే వారిని ‘శల్యులు’ అంటారు. మిమ్మల్ని చూసి ఈర్ష్య పడేవారి కన్నా వీరు నీచులు. వీరిని దూరంగా ఉంచండి. ఈ బాధ నుంచి బయటపడాలంటే ఒకే ఒక సూత్రాన్ని మనస్ఫూర్తిగా నమ్మండి. గెలిచేవాడు విమర్శకుల్ని పట్టించుకోడు. అతడికి ఒకే ఒక స్నేహితుడుంటాడు. ఏ మాత్రం సమయం దొరికినా ఆ స్నేహితుడి తోనే కలిసి ఉంటాడు. ఇంతకీ ఆ స్నేహితుడు ఎవరు?... మీరే!

 

మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తు న్నారు. చాలా సంబంధాలు వచ్చాయి. కానీ నాకు తగిన వ్యక్తి కనిపించలేదు. దాంతో నో చెప్పాను. అది మావాళ్లకు నచ్చట్లేదు. అందర్నీ కాదంటే చివరికి పెళ్లే కాదు, అంత పొగరెందుకు నీకు అని తిడు తున్నారు. వాళ్లతో పర్సనల్‌గా మాట్లాడి నప్పుడు వాళ్లు వెలిబుచ్చే కొన్ని భావాలు నాకు నచ్చ లేదు. దాంతో వద్దు అన్నాను. అంత మాత్రాన నేను పొగరుబోతునా? వాళ్లకోసం కాంప్రమైజ్ అయిపోవాలా?

 - వాసంతి, విశాఖపట్నం

 ‘నాకు తగిన వ్యక్తి కనిపించలేదు’ అన్నారు. నూరు శాతం తగిన వ్యక్తి అంటూ ఉండరు. వివాహం అంటేనే అడ్జస్ట్‌మెంట్. పెళ్లిచూపుల్లో మీకు కాబోయే భర్తతో మాట్లాడినప్పుడు ఎవరి భావాలూ నచ్చలేదని రాశారు. అంత కొద్ది సమ యంలో అంత ఘాటుగా ఉండే భావా లేమిటి? మీరు దేని గురించి చర్చించు కున్నారు? మీ మనసుకు నచ్చేవారు వచ్చేవరకూ ఎదురుచూస్తే వివాహం ఒక జీవితకాలం లేటు అవుతుంది. మీకు ఇంకా వయసు మీరకపోతే కొంత సమయం కావాలని మీ తల్లిదండ్రుల్ని అడగండి. ఆ గడువులోగా మీకు తగిన వాణ్ని ఎన్నుకోలేకపోతే వారు చెప్పిన వారినే చేసుకుంటానని చెప్పండి. వయసు పెరిగేకొద్దీ ‘బెగ్గర్స్ ఆర్ నాట్ ఛూసర్స్’ అనే సూక్తి వర్తిస్తుంది. అప్పుడిక ఎన్నుకోవటానికంటూ ఎవరూ మిగలరు.

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top