మంచి భార్యనవుతా!

మంచి భార్యనవుతా! - Sakshi


ఇంటర్వ్యూ

సోనమ్ కపూర్ పేరు చెప్పగానే ఆమె స్టయిల్ గుర్తొస్తుంది ఎవరికైనా. కొత్త కొత్త డిజైనర్ దుస్తులు, కళ్లు చెదరగొట్టే అధునాతన జ్యూయెలరీతో ఫ్యాషన్‌కు ప్రతీకలా కనిపిస్తుంది సోనమ్.  అయితే బయటకు కనిపించని సోనమ్ ఒకరున్నారు.  ఆమె గురించి మనకు తెలియని కొన్ని రహస్యాలు ఇవి...

 

అనిల్‌కపూర్ లాంటి ఫేమస్ హీరోకి కూతుర్ని కాబట్టి ఈజీగా సినిమాల్లోకి వచ్చేశానని చాలామంది అనుకుం టారు. కానీ నేను సినిమాల్లోకి రావ డానికి చాలా కష్టపడ్డాను. అవకాశాలు అందుబాటులో ఉన్నాఅందిపుచ్చుకో లేకపోయాను. ఎందుకంటే నేను చాలా లావుగా ఉండేదాన్ని. హీరోయిన్ అవ డానికి తగ్గట్టు స్లిమ్‌గా తయారవడానికి 35 కిలోలు తగ్గాల్సి వచ్చింది. నా స్కిన్ కూడా బాగుండేది కాదు. ఎంతో కష్ట పడి దాన్ని హెల్దీగా మార్చుకున్నాను.

 

నేను సినిమాల్లోకి రావడానికి స్ఫూర్తి ఎవరని నన్ను చాలామంది అడుగు తుంటారు. మా నాన్న పేరు చెబు తానని వాళ్ల ఉద్దేశం. కానీ నేనలా చెప్పను. ఎందుకంటే నాకు నిజమైన ఇన్‌స్పిరేషన్ వహీదా రెహమాన్. చిన్నప్పట్నుంచీ ఆవిడన్నా, ఆవిడ నటనన్నా చాలా ఇష్టం. ఆవిడలా అవ్వాలని తపించేదాన్ని.

 

నేను ఎక్కువ మేకప్ వేసుకుంటానని, బ్రైట్ కలర్స్ ధరిస్తానని కామెంట్ చేస్తుంటారు. నిజమే. ఫొటోలు, వీడియోలకు సూట్ కావడం కోసం అలా ధరిస్తాను. కానీ నిజానికి నాకు మేకప్ నచ్చదు. ఎక్కువ రంగులూ నచ్చవు. తెల్లని దుస్తుల్లో ఉన్న అందం ఇంకెందులోనూ ఉండదు.

 

ఫలానావాళ్లు చేసిన పాత్ర చేయాలని ఉంది అని చెప్పడం చిన్నతనంగా భావిస్తుంటారు కొంతమంది. నేనలా అస్సలు ఫీలవను. నాకు రెండు డ్రీమ్‌రోల్స్ ఉన్నాయి. ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’లో కాజోల్, ‘బ్లాక్’లో రాణీముఖర్జీ చేసిన పాత్రలు నాకొస్తే ఎంత బాగుండో అని పిస్తుంది. అలాగే మాధురి, శ్రీదేవితో కలిసి ఒక్క సీన్‌లో అయినా నటించాలన్నది నా కోరిక!


మళ్లీ లావైపోతానని భయపడి నోరు కట్టేసుకోవడం నావల్ల కాదు. ఇష్టమైనవన్నీ తినేస్తాను. చాట్, పావ్‌భాజీ చూస్తే అస్సలు ఆగలేను. కాకపోతే దానికి తగ్గ వర్కవుట్లు చేసేస్తుంటాను.

 

నాకు రకరకాల దుస్తులు కలెక్ట్ చేయడం హాబీ. అలాగే ఎక్కడ పెయింటింగ్ ఎగ్జిబిషన్ పెట్టినా వాలిపోతాను. మంచి మంచి పెయింటింగ్‌‌స కొనుక్కొ స్తాను. హ్యాండ్‌బ్యాగ్స్ కూడా సేకరిస్తా.

 

ఇష్టాల విషయంలో ఎంత స్పష్టత ఉందో అయిష్టాల విషయంలోనూ అంత స్పష్టత ఉంది నాకు. తాగుబోతులంటే పరమ అసహ్యం. అవసరంలో ఉన్నప్పుడు ముఖం తిప్పుకునే స్నేహితులంటే మంట. మాట ఇచ్చి తప్పేవాళ్లంటే కూడా కంపరం. ఈ లక్షణాలు ఉన్నవాళ్లను దగ్గరకు కూడా రానివ్వను.

 

నేను చాలా కూల్‌గా ఉండే మనిషిని. కాకపోతే కోపం వచ్చిందంటే ఓ రేంజ్‌లో వస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్లను తక్కువ చేసే మగాళ్లను చూస్తే చాలా కోపం వస్తుంది. అన్నింట్లోనూ ఆడదాని అండ కావాలి. కానీ తమతో సమానంగా చూడాల్సి వచ్చేటప్పటికి మాత్రం బాధ వచ్చేస్తుంది. అలాంటి వాళ్లని అస్సలు క్షమించను నేను.

 

పెళ్లి అంటే నాకు చాలా గౌరవం. అంత వరకూ ఏమాత్రం పరిచయం లేని వాళ్లను సైతం స్నేహితులుగా మార్చే స్తుంది పెళ్లి. ఒకరి కోసం ఒకరు ప్రాణ మిచ్చుకునేలా చేస్తుంది. అంత గొప్పది వివాహమనేది. నేను ఓ మంచి వైవాహిక జీవితాన్ని గడపాలని ఆశిస్తు న్నాను. మంచి భార్యను అవ్వాలను కుంటున్నాను. అందరికీ గొప్పగా చెప్పు కోవడానికి చేసేది కాదు కాపురం. మనల్ని మన భర్త/భార్య వదులుకో లేనట్టుగా చేయాలి. అప్పుడే ఏ పెళ్లయినా సక్సెస్ అవుతుందన్నది నా నమ్మకం.                               

 

  ఫలానా హీరోతో డేటింగ్ చేసేస్తోంది, సహ జీవనం చేసేస్తోందంటూ హీరోయిన్ల గురించి పత్రికల్లో రాసేస్తుంటారు. మిగతా వాళ్ల సంగతేమో కానీ, నా విషయంలో అవి ఎప్పటికీ పుకార్లే. ఎందుకంటే నేను ఇండస్ట్రీలోని వ్యక్తిని ప్రేమించను, పెళ్లి చేసుకోను!

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top