రెట్రో అప్‌డూ ఫిష్‌టెయిల్

రెట్రో అప్‌డూ ఫిష్‌టెయిల్


సిగ సింగారం

ఇది రెట్రో అప్‌డూ ఫిష్‌టెయిల్. ఈ హెయిర్ స్టయిల్ ఇటు కొప్పుగానూ... అటు అల్లికలతో జడలా కూడా కనిపిస్తుంది. ఈ రెట్రో అప్‌డూ ఫిష్‌టెయిల్ సాధారణంగా అన్ని డ్రెస్సుల మీదకూ నప్పుతుంది. దీన్ని వేసుకోవడానికి జుత్తు మరీ పొడవుగా ఉండాల్సిన అవసరం లేదు. అంతేకాదు, ఈ హెయిర్ స్టయిల్‌ను చాలా సులువుగా వేసుకోవచ్చు. జుత్తు పొడవుగా లేనివారు ఈ హెయిర్ స్టయిల్ తమకు నప్పదనుకుంటారు. కానీ ఒకసారి ఈ స్టయిల్‌ను ట్రై చేసి చూడండి. మీకే నచ్చుతుంది. ఎలా అంటే... ఇదిగో ఇలా...!

 

 

1. ముందుగా జుత్తునంతా చిక్కులు లేకుండా దువ్వుకోవాలి.

 

2. ఇప్పుడు జుత్తునంతటికీ రబ్బర్ బ్యాండ్ పెట్టి పోనీ వేసుకోవాలి.

 

3. ఫొటోలో కనిపిస్తున్న విధంగా బ్యాండ్ పైన భాగంలో ఉన్న జుత్తును చేతివేళ్లతో కాస్తంత దూరం చేసుకోవాలి. ఇప్పుడు పోనీని అందులోంచి కిందకు తీయాలి.

 

4. పైన చెప్పిన విధంగా చేస్తే జుత్తు 4వ నంబర్ ఫొటోలో కనిపిస్తున్నట్టు వస్తుంది.

 

5. ఇప్పుడు పోనీని ఓసారి దువ్వుకొని, రెండు భాగాలుగా చేసుకోవాలి.

 

6. ఆ రెండు భాగాలను రెండు పాయలుగా చేసుకొని.. ఒక్కో అల్లికకు ఒక్కో పెద్దపాయల నుంచి సన్నని పాయను తీసి కలుపుతూ అల్లుకోవాలి. అంతే ‘ఫిష్‌టెయిల్’ రెడీ అయిపోతుంది.

 

7. అలా జుత్తునంతా అల్లి, చివరకు రబ్బర్‌బ్యాండు పెట్టేయాలి.

 

8. ఇప్పుడు ఫిష్‌టెయిల్‌లోని ఒక్కో పాయను  కదిలిస్తూ... జడను వదులు చేసుకోవాలి.

 

9. తర్వాత ఆ ఫిష్‌టెయిల్‌ను ఫొటోలో కనిపిస్తున్న విధంగా... బ్యాండు పెట్టుకున్న చోట దూర్చి స్లైడ్స్ పెట్టేయాలి.

 

10. ఇప్పుడు కొప్పులోంచి జడ బయటకు రాకుండా, కావలసిన చోట స్లైడ్స్ పెట్టుకోవాలి. అంతే, ఎంతో అందమైన హెయిర్ స్టయిల్ రెడీ...

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top