రజనీ వర్సెస్ కట్టప్పా!

రజనీ వర్సెస్ కట్టప్పా!


రజనీ: కట్టప్పా... నీకో విషయం తెలుసా? మా ఊళ్లో చిన్నప్పుడు కరెంట్ ఉండేది కాదు. దీపాలు కూడా ఉండేవి కావు. అయినా సరే, అర్థరాత్రి వరకు కష్టపడి చదివేవాడిని...

కట్టప్ప: అదెలా????!!!!!

రజనీ: అగరుబత్తి వెలిగించి ఆ వెలుగులో శ్రద్ధగా చదువుకునేవాడిని...

కట్టప్ప: ???????!!!!!!!!???????

రజనీ: మరి నీ సంగతి?

కట్టప్ప: మీకు ఆ ఆగరు బత్తి అయినా ఉండేది. మాకు అది కూడా కొనే స్తోమత లేదు. అయినా సరే రాత్రి బాగా కష్టపడి చదువుకునేవాడిని....

రజనీ: అదెలా సాధ్యం?????!!!!!!

కట్టప్ప: మా ఇంటి పక్కన ప్రకాశ్, సూర్య అనే ఇద్దరు అన్నదమ్ములు, వారి చెల్లి జ్యోతి అని ఉండేవారు. రాత్రి సమయంలో వారిని మా ఇంటికి పిలిచి, వాళ్ల వెలుగులో చదువుకునేవాడిని.

 

 గబ్బర్‌సింగ్ వర్సెస్ సాంబ!

 

గబ్బర్: అరెవో సాంబా... ఎంతమంది?

 సాంబ:  ఇద్దరు దొరా...

 గబ్బర్: నేను లెక్కల్లో కొంచెం వీక్... 2 దేని తరువాత వస్తుంది?

 సాంబ: 1 తరువాత వస్తుంది...

 గబ్బర్:  అలాగా... 2కు ముందు ఏముంటుంది?

 సాంబ: 1

 గబ్బర్: మరి మధ్యలో ఏముంటుంది?

 సాంబ:  ఏమీ ఉండదు దొరా!

 గబ్బర్: మరి అలాంటప్పుడు రెండూ ఒకేసారి రావచ్చు కదా! ఏమిటి పిచ్చి వేషాలు?

 సాంబ:???!!!!!

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top