భార్యే మొసలి అయితే!

భార్యే మొసలి అయితే!


‘‘ఆకాశం దిగివచ్చి... మబ్బులతో వేసింది ఆ పందిరి! ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరిగింది పెళ్లంటే మరి!!’’ అవును, నిజంగానే అంగరంగ వైభవంగా జరిగిందా పెళ్లి. అందరి కళ్లు ఆ పెళ్లికూతురు మీదే. తెల్లని గౌన్‌లో కుందనపు బొమ్మలా మెరిసిన ఆమె... పెళ్లిలో సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌ అయింది. అందరి ఆశీస్సులతో ఓ మేయర్‌కి శ్రీమతి అయిపోయింది. అయితే కథలో ట్విస్ట్‌ ఏమిటంటే.. పెళ్లికూతురు మొసలి.



 మీరు చదివింది కరెక్టే. మొ..స..లి! ఏ ప్రాణినైనా అమాంతం నోటకరచి కరకరలాడించేందుకు ఎగబడే మొసలే. మెక్సికోలోని శాన్‌ పెడ్రో హుమెలెల అనే ప్రాంత మేయర్‌ (విక్టర్‌ అగైలార్‌).. ఓ మొసలిని పెళ్లాడాడు. ఆ తరువాత ప్రేమగా ముద్దాడాడు. ఇంతకీ ఇదంతా ఓ ఆచారమట. ఇలా మొసలికి పెళ్లి చేస్తే గ్రామానికి మంచి జరుగుతుందని ఆ గ్రామస్తుల నమ్మకం.



 అందుకే.. అంత ఘనంగా పాటలు, నృత్యాలు చేయడంతో పాటు... సంప్రదాయ విన్యాసాలతో ప్రతి ఏడాది ఈ పెళ్లితంతును ఓ పండుగలా జరుపుకుంటారు. పెళ్లి జరిగే ముందు రోజు కూడా పెళ్లి కూతురి(మొసలి)ని ముస్తాబు చేసి బాజాభజంత్రీల మధ్య ఊరంతా ఊరేగిస్తారు. ఈ ఆచారం ఇంచుమించు 18వ శతాబ్దం నాటిదట. భారతీయ సంతతికి చెందిన చోనాటల్‌ తెగవారు ఇంచుమించు 1789 నుంచి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top