లెదర్‌తో లవ్లీ ఐటమ్స్

లెదర్‌తో లవ్లీ ఐటమ్స్


నెలకు రెండు, మూడు జతల చెప్పులను వాడిపడేయడం మనలో చాలామందికి ఉన్న అలవాటే. అలాంటప్పుడు ఇంట్లోనే చెప్పులు తయారు చేసుకుంటే బాగుండని అందరికీ అనిపిస్తుంది. కానీ ఎలా చేసుకోవాలో తెలియదు. ఇక తెలిస్తే ఆగుతామా చెప్పండి. షాపుల్లో దొరికే లెదర్ తెచ్చుకొని ఇంట్లోనే చెప్పుల దగ్గర నుంచి ఇయర్ రింగ్స్, నెక్‌లేస్లు, లాకెట్లు, బ్రేస్‌లెట్లు.. ఇలా ఎన్నో ఎన్నెన్నో...



 కావలసినవి: రంగురంగుల లెదర్ షీట్స్ (షాపుల్లో దొరుకుతాయి), గ్లూ, కత్తెర, హుక్స్ (ఇయర్ రింగ్స్ తయారీకి)

 

తయారీ విధానం: చెప్పుల తయారీకి.. ముందుగా లెదర్ షీట్‌ను ఫొటోలో కనిపిస్తున్న విధంగా కత్తెర సాయంతో కట్ చేసుకోవాలి (ఎవరి కాలి సైజుకు తగ్గట్టుగా). తర్వాత సైడ్లకు ఉన్న ముక్కలను ఒకదానికొకటి అతికించాలి. గట్టిగా ఉండాలనుకుంటే దారంతో కుట్టుకోవచ్చు కూడా. ఆపైన దానిపై ఓ పెద్ద బటన్ లేదా ఏదైనా కుందన్‌ను గ్లూతో అతికించుకుంటే అందంగా కనిపిస్తాయి. అలాగే ఇయర్ రింగ్స్ తయారీ కోసం వాటికి అనుగుణంగా లెదర్‌ను ఫొటోల్లో కనిపిస్తున్న విధంగా కట్ చేసుకొని, వాటికి చిన్న రంధ్రం పెట్టి హుక్‌ను బిగిస్తే సరి. కేవలం కాలిజోళ్లు, రకరకాల ఇయర్ రింగ్సే కాక నెక్‌లేస్, లాకెట్స్‌ను కూడా ఈ లెదర్‌తో సులువుగా తయారుచేసుకోవచ్చు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top