ఐస్‌క్రీము భోజనంబు...

ఐస్‌క్రీము భోజనంబు...


ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐస్‌క్రీమ్‌ ఫ్యాన్స్‌లో మీరూ ఒకరా? అయితే.. మీకే ఈ సూటి ప్రశ్న? రోజు మొత్తంలో బ్రేక్‌ ఫాస్ట్, లంచ్, డిన్నర్‌ అన్నీ బంద్‌ చేసి... కేవలం ఐస్‌ క్రీమ్స్‌ మాత్రమే తింటూ ఉండగలరా? ‘ఓ యస్‌... ఐస్‌క్రీమంటే నాకు చచ్చేంత ఇష్టం! లొట్టలేసుకుంటూ లాగించేస్తా!’ అంటారా? మరైతే మరో ప్రశ్న! కేవలం ఐస్‌ క్రీమ్‌ తింటూనే.. ఓ వందరోజులు గడపగలరా? మై గాడ్‌.. అన్ని రోజులా? అని షాక్‌ అయ్యారు కదూ! కానీ, అది తనకే సాధ్యమని నిరూపించాడు కొలరాడోలోని లవ్లెండ్‌కి చెందిన 32 ఏళ్ల ఆంథోనీ హౌవార్డ్‌ క్రో.



 ఐస్‌క్రీమ్‌ ఆరోగ్యానికి భంగకరమంటూ డాక్టర్లు మొత్తుకుంటుంటే... అదేం కాదంటున్నాడు ఆంథోనీ. 2011లో ‘ఏడిఎస్‌ – ఐస్‌క్రీం’ అనే యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించిన ఆంథోనీ... గత కొన్ని రోజుల క్రితం తన వ్యూయర్స్‌కు ఈ కొత్త సలహా ఇచ్చాడు. ఉచిత సలహాలే! అని కొట్టేపడేసే ఛాన్స్‌ ఇవ్వకుండా... తను కూడా పాటించి చూపించాడు. ఇంచుమించు వారానికి కిలో చొప్పున.. వందరోజుల్లో 14 కేజీలు తగ్గి.. ఇట్స్‌ యువర్‌ టర్న్‌ అంటున్నాడు. తను తీసుకునే ఐస్‌క్రీమ్స్‌లో రోజుకు 2 వేల కేలరీలు మించకుండా చూసుకుంటూ.. కొద్దిగా ఆల్కాహాల్, చిన్న చిన్న కోక్స్‌ తాగుతూ నూరురోజులు గడిపేశాడు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top