మంచి కాఫీలాంటి జీవితం!

మంచి కాఫీలాంటి జీవితం!


 ‘‘హాయ్ రేఖా!’’

 ‘‘హాయ్ స్వప్నా.. వాట్ ఎ సర్‌ప్రైజ్! ఎన్నేళ్లయ్యిందే నిన్ను చూసి... ఎలా ఉన్నావ్? ఏం చేస్తున్నావే?’’

 ‘‘అయామ్ వర్కింగ్ ఇన్ ఐబీఎం రా. నువ్వేం చేస్తున్నావ్?’’

 ‘‘అయామ్ వర్కింగ్ ఫర్ మై ఫ్యామిలీ రా.’’

 ‘‘అదేంటే... గోల్డ్ మెడలిస్ట్‌వి. ఇంట్లో వంటలు వండుతున్నావా?’’

 ‘‘తప్పేముందే.. నా భర్త, నా పిల్లలకోసమేగా?’’ నవ్వింది రేఖ.

 ‘‘అలాంటప్పుడు చదవడమెందుకే. ముందే పెళ్లి చేసుకుని ఉండొచ్చుగా?’’

 ‘‘చదువు విజ్ఞానం కోసమే. ఆ నాలెడ్జ్ కోసం చదివాను. ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి చేయట్లేదు. అంతే.’’

 

 ‘‘మ్‌మ్‌మ్... సర్లే. మీ ఆయనేం చేస్తాడు?’’

 ‘‘స్కూల్ టీచర్.’’

 ‘‘వ్వాట్... స్కూల్ టీచర్‌ని పెళ్లి చేసుకున్నావా? ఏంటే షాకులమీద షాకులిస్తున్నావ్!’’

 ‘‘నీ కర్థం కాదులే. సరే.. మన ఫ్రెండ్స్ ఎవరైనా టచ్‌లో ఉన్నారా?’’

 ‘‘హా... సింధు, సునీత, మాధవి, భవాని, మనీషా, కుమార్, శంకర్ టచ్‌లో ఉన్నారే.’’

 ‘‘ఔనా... అయితే అందరూ కలిసి ఒకసారి మా ఇంటికి రండి.’’

 ‘‘తప్పకుండా. వాళ్లతో మాట్లాడి నీకు ఇన్‌ఫార్మ్ చేస్తాను. అయినా నువ్వు పిలిస్తే బావుంటుందేమో కదా.’’

 ‘‘ఫర్లేదులేవే... మన ఫ్రెండ్సేగా. నేను పిలిచానని చెప్పి నువ్వే తీసుకురా. ఓకే?’’

 ‘‘ఓకే. సీ యూ రా.’’

    

 ‘‘హాయ్ రేఖా.....!’’

 ‘‘వావ్... వాటే సర్‌ప్రైజ్! నిన్ననేగా చెప్పాను స్వప్నతో. అప్పుడే...! అయామ్ సో హ్యాపీ టూ సీ యూ ఆల్!’’... ఆహ్వానించింది రేఖ తన ఫ్రెండ్‌‌సని.‘‘ఔనే... స్వప్న నీ గురించి చెప్పేసరికి అందరికీ షాక్. ఉండబట్టలేక వచ్చేశాం’’ చెప్పారు ఫ్రెండ్స్.‘‘షాక్ ఏంట్రా? దేని గురించీ?’’‘‘నీ గురించే. మాకంటే తెలివైన దానివి. గోల్డ్ మెడలిస్ట్‌వి. నువ్విలా జాబ్ చేయకుండా... టీచర్‌ని పెళ్లిచేసుకుని...  హౌస్‌వైఫ్‌లా...?’’... ఇంకేం మాట్లాడాలో తెలీక ఆగిపోయారు ఫ్రెండ్స్. ‘‘హహహహ... దాని గురించా! అందులో షాకేముంది?’’ ‘‘షాక్ కాక ఏంటి? నీ నోట్స్ చదివి పాస్ అయిన నేను మైక్రోసాఫ్ట్‌లో జాబ్ చేస్తున్నా. నువ్వేమో... ఇలా?’’... నగిసింది మనీషా.

 

 ‘‘ఐతే ఏంటట?’’ అంది రేఖ.

 ‘‘అది కాదు రేఖా! అంత చదువు కుని... ఇప్పుడిలా ఉద్యోగం చేయకుండా.. హౌస్‌వైఫ్‌గా.. ఊరికి దూరంగా...’’ అంటూ ఆగిపోయాడు శంకర్.‘‘అదా... ఆనంద్ మైక్రోసాఫ్ట్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశాడు. అక్కడే పరిచయం. కానీ తనకు టీచింగ్ అంటే ప్యాషన్. అందుకే రిజైన్ చేసి ఇక్కడికి వచ్చేశాం. సర్లే... నా ముచ్చట తర్వాత చెప్పుకుందాం. మీ ముచ్చట్లేంటో చెప్పండి’’ అడిగింది రేఖ.‘‘ఏమున్నాయ్? మూడు క్రెడిట్ కార్డులు, ఆరు ఈఎంఐలులా ఉంది లైఫ్’’ నిట్టూర్చాడు కుమార్.‘‘అదేంట్రా.. ఆర్ యూ నాట్ హ్యాపీ?’’ అడిగింది రేఖ.

 

 ‘‘హా... ఫస్ట్ తేదీన హ్యాపీనే. ఆ తర్వాతంతా టెన్షనే’’ చెప్పాడు కుమార్.

 ‘‘ఏంట్రా వీడిలా మాట్లాడు తున్నాడు’’ అంది రేఖ నవ్వుతూ.

 ‘‘నిజమే రేఖా. ఈ సాఫ్ట్‌వేర్ జాబ్స్ అన్నీ అంతే. జీతాలు భారీగా కనిపిస్తాయి. కానీ గాడిద చాకిరీ. సంపాదించిందంతా ఈఎంఐలు కట్టడానికే సరిపోతుంది. ఇక సుఖపడేదెక్కడ?’’ చెప్పింది సింధు. ‘‘సింధు చెప్పేది నిజమేరా. ఇన్ టైమ్‌లో ప్రాజెక్టు పూర్తి చేయకపోతే ఎక్కడ ఫైర్ చేస్తారేమోనని రేయింబవళ్లూ కష్టపడక తప్పడం లేదు. ఒళ్లు హూనమైపోతుం దనుకో’’ అంది మాధవి.  ‘‘సరే సరే... లెట్ మి గెట్ సమ్ కాఫీ ఫర్ యూ’’ అంటూ కిచెన్లోకి వెళ్లి కాఫీ పట్టు కొచ్చింది రేఖ... సిల్వర్, పోర్సిలిన్, గ్లాస్, ప్లాస్టిక్, పేపర్ కప్పుల్లో. అందరూ కప్పులు తీసు కున్నారు.  ‘‘ఏంటే... ఒక్కొక్కళ్లకి ఒక్కో రకమైన కప్‌లో ఇచ్చావ్? మీ ఇంట్లో కాఫీ సెట్ కూడా లేదా ఏంటీ?’’ కాస్త ఎగతాళిగా అడిగింది స్వప్న.

 

 రేఖ నవ్వింది. ‘‘నేను కాఫీ తీసుకు రాగానే మీరందరూ కాస్ట్లీ కప్పులు తీసుకుని పేపర్ కప్పు నాకు వదిలి పెట్టారు. ప్లాస్టిక్ కప్పులూ ట్రేలోనే ఉండిపోయాయి. నిజానికి మీకు కావా ల్సింది కాఫీ... కప్పు కాదు. కానీ అందరూ కప్పులకే ఇంపార్టెన్స్ ఇచ్చారు. అప్పటికీ తృప్తి పడకుండా పక్కవారి కప్పులవైపు చూస్తున్నారు... అది తీసుకుని ఉంటే బావుండేదేమో అని. కాఫీ జీవితమైతే.. జాబ్, మనీ, స్టేటస్ ఇవన్నీ కప్పులన్న మాట. కప్పు మారినంత మాత్రాన కాఫీ టేస్ట్ మారదు. కప్పుమీద కాన్సన్‌ట్రేషన్ ఉన్నంతకాలం కాఫీని ఎంజాయ్ చేయలేం’’ చెప్పింది రేఖ. నిజమేనన్నట్లుగా తలూపుతూ... ఆలోచిస్తూ... కాఫీని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు ఫ్రెండ్స్.

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top