చంద్రబింబం: అక్టోబర్ 19 నుండి 25 వరకు


మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

 ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. ఆస్తులు సమకూర్చుకుంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. పారిశ్రామికరంగం వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం.

 

 వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)

 కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఇంటాబయటా ఎదురుండదు. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సోదరులు, బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు.  వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళారంగం వారికి సన్మానాలు.  వారం మధ్యలో దూరప్రయాణాలు.

 

 మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)


 కొద్దిపాటి చికాకులు నెలకొన్నా క్రమేపీ సర్దుబాటు కాగలవు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. వాహనాలు, భూములు కొంటారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు కొంత వరకూ తొలగుతాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో అనుకోని ప్రయాణాలు.

 

 కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)

 పనుల్లో కొంత జాప్యం తప్పదు. ప్రయాణాలలో మార్పులు ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. సోదరులు, మిత్రులతో మాటపట్టింపులు. ఆరోగ్యపరంగా చికాకులు. వ్యాపార విస్తరణ యత్నాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పవు. పారిశ్రామికవర్గాలకు విదేశీపర్యటనలు వాయిదా. వారం మధ్యలో ధన, వస్తులాభాలు.

 

 సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

 పట్టింది బంగారమే అన్నట్టుంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలలో ప్రోత్సాహకరం. ఉద్యోగులకు ఉన్నతస్థితి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు. వారం చివరిలో అనారోగ్యం. ప్రయాణాలలో అవాంతరాలు.

 

 కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,)

 దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వ్యవ హారాలలో విజయం సాధిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. మీ శ్రమ వృథా కాదు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవర్గాలకు సన్మానయోగం. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం.

 

 తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.)

 ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు ఊహించని అవకాశాలు. వ్యాపారులు అనుకున్న లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు  విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం.

 

 వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)


 మీ ఊహలు నిజం కాగలవు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. జీవితాశయం నెరవేరుతుంది. వాహనయోగం. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలలో అనుకోని లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల వారు అభివృద్ధి పథంలో సాగుతారు. వారం మధ్యలో ఆరోగ్యభంగం. బంధువులతో వివాదాలు.

 

 ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)

 ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న రీతిలో సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. పోటీపరీక్షల్లో విజయం. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. రాజకీయవర్గాలకు సన్మానయోగం. వారం  చివరిలో ధనవ్యయం. అనుకోని ప్రయాణాలు.

 

 మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)

 పనులు నెమ్మదించినా క్రమేపీ పుంజుకుంటాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. బంధువుల నుంచి ఒత్తిడులు రాగలవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వాహనసౌఖ్యం. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. కళారంగం వారికి ఒత్తిడులు. వారం ప్రారంభంలో ధనవ్యయం.

 

 కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)

 దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. పనులలో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు. ఉద్యోగులకు విధుల్లో చికాకులు తొలగే అవకాశం. రాజకీయవర్గాలకు కొత్త హోదాలు. వారం మధ్యలో కుటుంబసభ్యులతో విభేదాలు.

 

 మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)

బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో దూరప్రయాణాలు. ధనవ్యయం. శ్రమాధిక్యం.

 - సింహంభట్ల సుబ్బారావు

 జ్యోతిష పండితులు

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top