ఆవులకు అమృతం.. యాపిల్ వైన్
శ్రీకృష్ణుడి గానామృతం విని పరవశించేవట పురాణ గోవులు. అయితే, ఈ ఫ్రాన్సు ఆవులకు నిజంగానే మధువు తాగిస్తున్నాడు అక్కడి రైతు ఫ్రాంకోయిస్ జేవియర్ క్రాక్వెలిన్. తన వ్యవసాయ క్షేత్రంలోని పశువులకు రోజూ అతడు ‘సైడర్’ ఇస్తున్నాడు. యాపిల్ జ్యూస్‌తో తయారయ్యే ఈ మద్యాన్ని యాపిల్ వైన్ అని కూడా పిలుస్తారు. సైడర్ వల్ల మరింత నాణ్యమైన మాంసం వస్తుందట! ఇలా పశువులకు మద్యం తాగించడం జపాన్‌లోనూ ఆచరణలో ఉంది. అక్కడి వాగ్యూ ఆవులకు బీరుగానీ, వైన్‌గానీ తాగిస్తారు.
మరిన్ని వార్తలు