స్వచ్ఛ ఊపిరి

స్వచ్ఛ ఊపిరి


నగర జీవితంలో స్వచ్ఛమైన గాలి కూడా కరువే. ఇంట్లో నాలుగు గోడల మధ్య తలుపులన్నీ బిడాయించేసుకున్నా, ఏదో ఒక రూపంలో కాలుష్యాలు చొరబడుతూనే ఉంటాయి. పరిసరాల్లోని దుర్గంధాలన్నీ ఇంట్లోకీ వ్యాపిస్తూనే ఉంటాయి. అగరొత్తుల మొదలుకొని రూమ్‌ఫ్రెషనెర్ల వరకు ఎన్ని వాడినా పూర్తి ప్రయోజనం ఉండనే ఉండదు. పైగా అగరొత్తుల పొగ, రూమ్‌ఫ్రెషనర్ల వాసన సరిపడని వారికి పరిస్థితి ఉక్కిరిబిక్కిరిగా ఉంటుంది. ఇలాంటి సమస్యలకు పరిష్కారమే ఈ ఫొటోలో కనిపిస్తున్న ‘ఏరోక్యూర్ వన్’ ఎయిర్ ప్యూరిఫైయర్.



ఇది ఇంట్లో ఇక నిశ్చింతగా ఊపిరి పీల్చుకోవచ్చు. గాలిలో ఉండే దుమ్ము, ధూళి కణాలను, బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ వంటి  ప్రమాదకరమైన సూక్ష్మజీవులను, దుర్గంధాన్ని ప్రసరించే ఇతర కారకాలను ఇది సమర్థంగా తొలగిస్తుంది. హెపా ఫిల్టర్లతో పనిచేసే ఎయిర్ ప్యూరిఫయర్ దాదాపు 800 చదరపు అడుగుల మేరకు పరిసరాల్లోని గాలిని స్వచ్ఛంగా మారుస్తుంది. ఇందులోని శక్తిమంతమైన అల్ట్రావయొలెట్ లైట్ రోగకారక సూక్ష్మజీవులను ఇట్టే నాశనం చేస్తుంది. ఇందులోని ఫిల్టర్లు ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు మన్నుతాయి. ఆ తర్వాత వాటిని మార్చేసుకుంటే చాలు, ఇది యథాప్రకారం పనిచేస్తుంది.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top