తోలు వలవడంలో ముందు...

తోలు వలవడంలో ముందు...


ఫ్రాన్స్ తీరపట్టణమైన డన్‌క్రిక్ మేయర్ 2005లో చిత్రమైన పోటీకి పిలుపునిచ్చాడు. అమ్మమ్మలు, నానమ్మలు సులువుగా ష్రింప్స్(చిన్నరొయ్యలు) ‘గుల్లలు’ ఒలవగలుగుతున్నారుగానీ ఇప్పటివాళ్లకు ఆ విద్య అబ్బడంలేదన్న బెంగలోంచి ఆయనకీ ఆలోచన వచ్చింది. దాని ఫలితమే ‘టెన్త్ ఇంటర్నేషనల్ ష్రింప్ పీలింగ్ కాంపిటీషన్’! ఇక్కడ న్యాయనిర్ణేతలు ఒక్కొక్కరి సీసాల్లోని రొయ్యల్ని లెక్కించడానికి పూనుకుంటున్నారు. పది నిమిషాల్లో అందరికంటే ఎక్కువగా ఒలిచిన కొలెట్ వాంజింగెల్ అనే బామ్మే విజేతగా (ఇన్‌సెట్) నిలిచింది.

 

 లొట్టిపిట్టల పరుగు

ఈ దృశ్యం, ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన ఒంటె పరుగుపందాల ‘ఫ్రెంచ్ కప్’లోనిది. వివిధ దేశాలకు చెందిన జాకీలు, ఒంటెలు 1000 మీటర్ల పందెంలో పాల్గొన్నప్పటి ఫొటో! పాకిస్తాన్, ఒమన్, సౌదీ అరేబియా, మంగోలియా లాంటి దేశాల్లో ఒంటెల పోటీలు జోరుగా సాగుతాయి. గుర్రప్పందాల్లాగే బెట్టింగులూ ఉంటాయి. ఆస్ట్రేలియాలో జరిగే ‘ద బౌలియా డిజర్ట్ సాండ్స్’లో ప్రైజ్‌మనీ విలువ సుమారు 14 లక్షల రూపాయలు!  అన్నట్టూ, ఒంటెలు గంటకు 65 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలవు!

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top