విష హృదయం
రమణి కళ్లు కన్నీటి కుండల్లా ఉన్నాయి. ఏడుస్తూ చెబుతోంది... ‘‘ఎప్పుడూ ఏదో పరధ్యానంగా ఉండేవారు. అలా ఉండడం నచ్చక చనువుగా మందలించేదాన్ని తప్ప అంతకుమించి మా మధ్య పెద్ద తగాదాలేమీ లేవు’’ కర్చీఫ్‌తో కన్నీళ్లు తుడుచుకుంటూ భర్త రంగారావు శవం వైపు చూస్తూ అంది రమణి.‘‘ఎంత కాలం నుంచి పరధ్యానంగా ఉంటున్నారు?’’ అడిగాడు ఇన్స్పెక్టర్ నరసింహ.‘‘పెళ్లయినప్పటి నుంచీ అంతే.
ఈయన ఎప్పుడూ మూడీగా ఉండటం చూసి నా ఫ్రెండ్స్ వెక్కిరించేవాళ్లు’’ కాస్త బాధగా అంది రమణి.‘‘మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఆయనకు ఇష్టం లేనట్లు ఉంది’’ రమణి వైపు చూస్తూ అన్నాడు ఇన్స్పెక్టర్ నరసింహ.‘‘అదేమీ లేదు. ఇంటి పెద్దలను ఎదురించి నన్ను పెళ్లి చేసుకున్నాడు’’ అన్నది రమణి పాయిజన్ బాటిల్ వైపు చూస్తూ. ఆ పాయిజన్ బాటిల్ రంగారావు పడిపోయి ఉన్న సోఫాకు కొద్ది దూరంలో ఉన్న టేబుల్ మీద ఉంది.
‘‘కూరగాయలు తేవడానికి మార్కెట్‌కు వెళ్లి వచ్చాను. ఈలోపు ఇలా జరిగింది’’ కళ్లనీళ్లు తుడుచుకుంటూ అన్నది రమణి. ‘‘మీరు ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు పరిస్థితి ఏమిటి?’’‘‘నేను ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆయన చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఏదో చెప్పాలని తపిస్తున్నాడు. నన్ను క్షమించు అన్నట్లుగా సైగలు చేశాడు’’ చెప్పింది రమణి. పాయిజన్ బాటిల్‌ను పరీక్షకు పంపించాడు ఇన్స్పెక్టర్. ‘రంగారావుది ఆత్మహత్య కాదని, హత్య అని, ఈ హత్య చేసింది రమణి అని తేల్చారు పోలీసులు.రంగారావుది ఆత్మహత్య కాదని హత్య అని పోలీసులు ఎలా తేల్చారు?
అద్దంలో ఆన్సర్ (కుడివైపు నుంచి అద్దం పెట్టుకుని చదవండి)
జవాబు: టేబుల్ మీద ఉన్న పాయిజన్ బాటిల్ చాలా పవర్ఫుల్ అని, క్షణాల్లో ప్రాణాలు తీసే విషం అని పరీక్షల్లో తేలింది. ఈ పరిస్థితుల్లో... రమణి బయటికి వెళ్లి ఇంటికి వచ్చే వరకు రంగారావు బతికి ఉండడం అసాధ్యం. మరో విషయం... పాయిజన్ బాటిల్ దూరంగా ఉండడం. విషం మింగగానే... బాటిల్‌ను అక్కడే వదిలేస్తాడుగానీ, టేబుల్ మీద పెట్టడు!
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు