మీకు తెలుసా?

మీకు తెలుసా?


 ఇంట్లో బల్బ్‌ను మార్చడానికి మనం ఎలక్ట్రీషియన్‌ను పిలువం. మనమే స్వయంగా మార్చేసుకుంటాం. ఆస్ట్రే లియాలోని విక్టోరియా రాష్ర్టంలో అది కుదరదు. అక్కడ బల్బ్ మార్చడానికి కూడా తప్పనిసరిగా క్వాలిఫైడ్ ఎలక్ట్రీషియన్‌ను పిలవాల్సిందే. అది రూలు!

 నార్త్ కొరియాలో జీన్స్ ధరించడం చట్ట విరుద్ధం!

 కంగారూలు వెనక్కి నడవలేవు.

 బ్రూస్లీ పుస్తక ప్రియుడు. ఆయన లైబ్రరీలో వేలాది పుస్తకాలు ఉండేవి!

 2008లో ‘చైనా యూరిన్ థెరపీ అసోసియేషన్’ ఏర్పడింది. స్వమూత్రపానం వల్ల కలిగే ప్రయో జనాల గురించి ఈ అసోసియేషన్ దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తుంది. మొదట్లో ఇందులో 400 మంది సభ్యులుండేవారు. ఇప్పుడు వారి సంఖ్య వెయ్యికి చేరుకుంది!

 పరిమితిని మించి ఎక్కువ లావు కావడం జపాన్‌లో చట్టవిరుద్ధం!

 కెనడా నేషనల్ రేడియోలో  ఒకటి రెండు మినహా మిగతావన్నీ కెనడియన్ గాయకులు పాడిన పాటలనే ప్రసారం చేస్తారు!

 హాలీవుడ్‌లో టాకీలు వచ్చిన తరువాత వచ్చిన ‘షార్టెస్ట్ డైలాగ్ స్క్రిప్ట్’ సినిమాగా ‘సెలైంట్ మూవీ’ (1976) రికార్డుకెక్కింది.

     {పపంచంలో జపాన్ రైళ్లకు మాత్రమే ఆలస్యంగా రాని రైళ్లుగా పేరుంది. అక్కడి రైళ్లు 18 సెకండ్లకు మించి ఎప్పుడూ ఆలస్యంగా రావట!

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top