నేను పక్కా క్రిమినల్‌!

నేను పక్కా క్రిమినల్‌!


‘ఈ కైజర్‌ని చంపేవాడు ఇంకా పుట్టలేదు’ అంటూ ‘అతి«థి’ సినిమాతో ఉత్తమ విలన్‌ అనిపించుకున్నారు మురళీశర్మ.  హిజ్రాగా నటించినా, ఒక పాత్ర కోసం గుండు కొట్టించుకున్నా...ఎప్పటికప్పుడు తన నటనలో వైవిధ్యాన్ని చూపడానికి ప్రయత్నిస్తుంటారు.



 స్కూల్, కాలేజీ రోజుల నుంచే నాటకాల్లో నటించేవాడు మురళీశర్మ.  ముంబైలోని ‘రోషన్‌ తనేజాస్‌ యాక్టింగ్‌’ స్కూల్‌లో శిక్షణ పూర్తయిన తరువాత సహాయ దర్శకుడిగా పనిచేయడానికి దర్శకులను కలవడం మొదలుపెట్టాడు. నటన అంటే ఇష్టం ఉన్న శర్మ దర్శకత్వ శాఖ వైపు అడుగులు వేయడానికి కారణం... సరిౖయెన పాత్రలు రాకపోవడమే.



డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన తక్కువ కాలంలోనే మనసు నటన వైపు లాగింది. వినోద్‌ పాండే ‘రిపోర్టర్‌’ అనే సీరియల్‌ తీస్తున్నాడు అని తెలుసుకొని ప్రయత్నిద్దామనుకున్నాడుగానీ, గతంలో వృథా అయిన ప్రయత్నాలు గుర్తుకు వచ్చి ‘ఇది జరిగే పనేనా’ అనుకున్నాడు. అందుకే పాండే ఇంటి అడ్రస్‌ కనుక్కొని సరాసరి వెళ్లి కలిశాడు. అలా ‘రిపోర్టర్‌’ సీరియల్‌లో నటించే అవకాశం వచ్చింది. తొలి అడుగు పడింది.



అయినప్పటికీ... నాలుగు సంవత్సరాల స్ట్రగుల్‌ íపీరియడ్‌! అయినా ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. జీటీవి సీరియల్‌ ‘రిష్తే’లో రామ్‌కలీ అనే హిజ్రా పాత్రను పోషించాడు శర్మ. దీని కోసం ఎందరో హిజ్రాలను కలిసి మాట్లాడి వారి సాధకబాధకాలను అవగాహన చేసుకున్నాడు. శర్మలో మంచి నటుడు ఉన్నాడు అనే విషయం రామ్‌కలి పాత్ర ఇండస్ట్రీకి చెప్పకనే చెప్పింది. ‘డయల్‌ 100’ సీరియల్‌లో చేసిన పోలీసు  పాత్రకు కూడా మంచి గుర్తింపు వచ్చింది.



‘ధూప్‌’లో ఆర్మీ ఆఫీసర్, ‘మక్బూల్‌’లో సీనియర్‌ పోలీస్‌ ఆఫీసర్, ‘మై హూ నా’లో కెప్టెన్‌ ఖాన్‌గా వెండితెరపై తనదైన గుర్తింపు తెచ్చుకున్న మురళీశర్మ హిందీ, ఇంగ్లిష్‌లతో సహా తెలుగు, తమిళ, మరాఠీ, గుజరాతీ భాషలు మాట్లాడగలరు.‘అతిథి’ సినిమాలో ‘కైజర్‌’గా తెలుగు తెరకు పరిచయం అయిన మురళీశర్మ  పుట్టింది మన గుంటూరు జిల్లాలోనే!  ‘కంత్రీ’  ‘ఊసరవెల్లి’ ‘మిస్టర్‌ నూకయ్య’ ‘కృష్ణం వందే జగద్గురుం’ ‘ఎవడు’...మొదలైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మురళీశర్మ ‘పట్టుదలే విజయానికి మూలం’ అనే మాటను బలంగా నమ్ముతారు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top