4 అక్టోబర్ నుంచి 10 అక్టోబర్, 2015 వరకు

4 అక్టోబర్ నుంచి 10 అక్టోబర్, 2015 వరకు


వారఫలాలు

 మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)

 ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. గృహ నిర్మాణయత్నాలు సానుకూలం. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. ఎరుపు, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

 

 వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)

 అతిథుల ద్వారా కీలక విషయాలు తెలుసుకుంటారు. రావలసిన సొమ్ము అందదు. నిర్ణయాలలో ఆచితూచి ముందుకు సాగడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. తెలుపు, నేరేడురంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

 

 మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

 పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులలో విజయం. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సఫలం. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు. ఆకుపచ్చ, ఊదారంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

 

 కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)

 మిత్రులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. మీ సేవలు అందరిలో గుర్తింపు పొందుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. పనుల్లో పురోగతి సాధిస్తారు. సోదరులతో నెలకొన్న వివాదాలు తొలగుతాయి. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. రాజకీయవర్గాలకు సన్మానాలు. తెలుపు, చాక్లెట్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

 

 సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)

 ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులు, మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వివాహ,ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కివస్తుంది. వ్యాపారాలు విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు ఊరిస్తాయి. ఎరుపు, నేరేడురంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. పార్వతీదేవికి కుంకుమార్చన చేయండి.

 

 కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)

 చేపట్టిన పనులు సకాలంలోనే పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. చేజారిన వస్తువులు తిరిగి దక్కుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఒక కోర్టు వ్యవహారంలో విజయం. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. వ్యాపారాలు లాభకరం. ఉద్యోగులకు పదోన్నతులు. కళా రంగం వారికి అవార్డులు. పసుపు, తెలుపురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.


 తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)

 ముఖ్యమైన వ్యవహారాలలో విజయం. కుటుంబంలో శుభకార్యాలు. ఒక లేఖ ద్వారా ముఖ్య సమాచారం తెలుసుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. రావలసిన డబ్బు అందుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. నీలం, లేత ఆకుపచ్చ రంగులు,  పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

 

 వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)

 చికాకులు క్రమేపీ తొలగుతాయి. ఆర్థికంగా బలం చేకూరుతుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. దూరపు బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు శ్రమకు తగ ్గఫలితం దక్కుతుంది. లేత ఎరుపు, గులాబీ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతిపూజలు చేయండి.

 

 ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

 విభేదాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థుల కలలు నెరవేరే సమయం. ఈతిబాధల నుంచి బయటపడతారు. వాక్చాతుర్యంతో ఆక ట్టుకుంటారు. వ్యాపారాల విస్తరణలో ముందడుగు. ఉద్యోగులకు ఉన్నతస్థితి. కళారంగం వారికి పురస్కారాలు. లేత ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవికి కుంకుమార్చన చేయండి.

 

 మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)

 కొత్త పనులు ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అందరిలోనూ మీకంటూ ప్రత్యేకతను చాటుకుంటారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. భూములు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కవచ్చు. పారిశ్రామికవేత్తలకు సంతోషకరమైన సమాచారం. ఆకుపచ్చ, నీలం రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

 

 కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)

 ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. కొన్ని సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. శ్రమ వృథా కాదు. విద్యార్థులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ఇంటి నిర్మాణాల్లో ఆటంకాలు తొలగుతాయి. గతంలో నిలిచిపోయిన పనులు కూడా పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. కళారంగం వారికి సన్మానాలు. నలుపు, నేరేడురంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

 

 మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)

 మీ సత్తా చాటుకునే సమయం, అధైర్యపడొద్దు. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆస్తి వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు పదవీయోగం. తెలుపు, చాక్లెట్ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.



 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top