వారఫలాలు ( 1 మార్చి నుంచి 7 మార్చి, 2015 వరకు )

వారఫలాలు ( 1 మార్చి నుంచి 7 మార్చి, 2015 వరకు )


మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)

కొన్ని ప్రతిబంధకాలు ఎదురైనా పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులు కొత్త హోదాలు దక్కించుకుంటారు. పారిశ్రామికవేత్తలకు పురస్కారాలు.

 

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.  ఆలోచనలు నిలకడగా ఉండవు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యపరంగా చికాకులు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు ఉంటాయి. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. వారం మధ్యలో శుభవార్తలు.

 

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికవర్గాలకు అనుకోని ఆహ్వానాలు. వారం చివరిలో అనారోగ్యం.

 

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)

కొత్త పనులకు శ్రీకారం చుడతారు. పరిచయాలు పెరుగుతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కళారంగం వారికి అవార్డులు. వారం ప్రారంభంలో బంధువులతో వివాదాలు.

 

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)


సన్నిహితుల నుంచి ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. మీ శ్రమ ఫలిస్తుంది. భూములు, వాహనాలు కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబ సభ్యులతో వివాదాలు.

 

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)

చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రుల నుంచి ఆహ్వానాలు రాగలవు. భూవివాదాల పరిష్కారం. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు.

 

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)

రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. భూములు, వాహనాలు కొంటారు. విద్యార్థుల యత్నాలు ఫలిస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. కళారంగం వారికి సన్మానాలు. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. ఆరోగ్యసమస్యలు.

 

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)

పనులు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు.

 

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగించినా అవసరాలు తీరతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని వివాదాలను నేర్పుతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. వారం మధ్యలో అనారోగ్యం.

 

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)

ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. పనులు చకచకా సాగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. వస్తు, వస్త్రలాభాలు. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వాహనసౌఖ్యం. విద్యార్థులకు మంచి ఫలితాలు దక్కుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. వారం చివరిలో అనారోగ్యం.

 

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. కార్యజయం. విద్యార్థులు, నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది.  ఉద్యోగులకు ప్రమోషన్లు. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. ఆరోగ్యభంగం.

 

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)

కుటుంబ సభ్యులతో వివాదాలు తీరతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు.  ఆస్తిలాభ సూచనలు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో కుటుంబంలో సమస్యలు.



సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top