ఇక వేపుళ్లు ధైర్యంగా తినొచ్చు!

ఇక వేపుళ్లు ధైర్యంగా తినొచ్చు!


డీప్ ఫ్రై... ఆరోగ్యంగా ఉండాలనుకునేవాళ్ల డిక్షనరీ నుంచి ఈ మాటను తొలగించాల్సిందే అంటారు వైద్యులు. కడాయి నిండా నూనె పోసి, అందులో మునిగేలా చేసి మరీ వేయించే ఆహార పదార్థాలను తింటే ఆయువు తరుగుతూ పోతుంది. అందుకే వాటికి ఫుల్‌స్టాప్ పెట్టాల్సి వస్తుంది. అలాగని జిహ్వను చంపుకోలేం. ఏదో ఒక సమయంలో నాలుక పీకుతూనే ఉంటుంది... మాంచి వేపుడు లాగించాలని! అలాంటప్పుడు మనల్ని ఆదుకుని, మన ఆశను తీరుస్తుంది ఈ డీప్ ఫ్రయర్!

 

యాక్టీఫ్రయర్ అని పిలిచే ఈ చిన్ని యంత్రంలో వేపుడు చేయడానికి ఒక్క నూనె చుక్క కూడా వేయాల్సిన పని లేదు. వేయించాలనుకున్నవాటిని వేసి, మూత పెట్టి, బటన్ నొక్కితే చాలు... చక్కగా వేగిపోతాయి. మరీ నూనె తగలకుండా తినలేం అనుకుంటే, ఓ చెంచాడు వేసుకుంటే చాలు. ఆ చెంచా కూడా ఫ్రయర్‌తో పాటే వస్తుంది. నూనె వేసినా, వేయకపోయినా మాడిపోవడమనే సమస్యే ఉండదు. ఎంత వేగాలో దాన్ని బట్టి వేడిమిని ముందే సెట్ చేసేసుకుంటే, వేగాక యంత్రం అదే ఆగిపోతుంది. రెండు వేపుళ్లను ఒకేసారి చేసుకునే వెసులుబాటు కూడా ఉంది (రెండు అరలు ఉంటాయి. మొదటి ఫొటో చూడండి). అందుకే దీన్ని మల్టీకుక్కర్ అని కూడా అంటారు. ఇంత ఉపయోగం ఉన్న ఈ ఫ్రయర్ వెల... మూడు వేల లోపే!

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top