SMS : పైలాపచ్చీస్

SMS : పైలాపచ్చీస్

 వోడాఫోన్‌లో పనిచేసే ఇంజనీర్ నీల్ పాప్‌వర్త్ 1992 డిసెంబర్ 3న ‘మెర్రీ క్రిస్మస్’ అంటూ తొలి ఎస్‌ఎంఎస్‌ను తన కొలీగ్‌కు పంపాడు. తొలి ఎస్‌ఎంఎస్ విజయవంతం కావడానికి దాదాపు దశాబ్దం ముందు నుంచే ఇలాంటి సేవలను అందుబాటులోకి తెచ్చే పరిశోధనలు, ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి. జర్మన్ ఇంజనీర్ ఫ్రీడ్‌హెల్మ్ హీల్‌బ్రాండ్, ఫ్రెంచి ఇంజనీర్ బెర్నార్డ్ గిల్లెబార్ట్ 1984లోనే ఎస్‌ఎంఎస్ సాంకేతిక పరిజ్ఞానానికి, ప్రమాణాలకు రూపకల్పన చేశారు. కొత్త సహస్రాబ్ది ప్రారంభమయ్యే నాటికి మొబైల్ ఫోన్లు మారుమూల ప్రాంతాలకు సైతం అందుబాటులోకి వచ్చాయి. ఏడాది ఏడాదికీ మొబైల్ ఫోన్ల మోడళ్లలో రకరకాల మార్పులు వచ్చాయి. వాటికి కెమెరాలు, వాయిస్ రికార్డింగ్ హంగులు వచ్చి చేరాయి.

 

  ఇవెన్ని వచ్చినా ఎస్‌ఎంఎస్‌ల జోరు ఆగలేదు సరికదా మరింత పెరుగుతూ వస్తోంది. ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల ఎస్‌ఎంఎస్‌లు ఫోన్లు మారుతున్నాయి. ఎస్‌ఎంఎస్‌ల వినియోగంలో కుర్రకారుదే జోరెక్కువని అంతర్జాతీయ గణాంకాలు చెవి‘సెల్లు’ కట్టుకుని మరీ చెబుతున్నాయి. సెల్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాక మనుషులు ఒకరినొకరు కలుసుకోవడం తగ్గింది. మాటా మంతీ అంతా సెల్‌లోనే అనే పద్ధతి మొదలైంది. ఎస్‌ఎంఎస్‌ల వాడుక పెరగడంతో పాటు స్మార్ట్‌ఫోన్లలో రకరకాల యాప్‌ల ద్వారా టెక్స్ట్ మెసేజ్‌లు పంపే వెసులుబాటు అందుబాటులోకి రావడంతో సంక్షిప్త సందేశాలదే రాజ్యంగా మారింది. 

 

 దశాబ్దం కిందట సెల్‌ఫోన్లలో సంభాషణల సగటు నిడివి 3.5 నిమిషాలు ఉండేది. టెక్స్ట్ మెసేజ్‌ల జోరు పెరగడంతో సంభాషణల సగటు నిడివి 2. 2 నిమిషాలకు పరిమితమైందని అంతర్జాతీయ గణాంకాలు చెబుతున్నాయి. ఎస్‌ఎంఎస్‌లు మనుషుల మధ్య మాటా మంతిని బొత్తిగా కరువు చేసేస్తున్నాయని, మానవ సంబంధాలను దూరం చేస్తున్నాయని వాపోతున్న వారు లేకపోలేదు. అయితే, టెక్స్ట్ మెసేజ్‌ల దూకుడు మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గుముఖం పట్టడంలేదు. 

 

 క్రిస్మస్ శుభాకాంక్షలతో తొలి ఎస్‌ఎంఎస్

 
Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top