నగరం... బిందాస్


 నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. స్టడీస్ కూడా ఇక్కడే. అమ్మ డిఫెన్స్‌లో గెజిటెడ్ ఎంప్లాయ్. నాన్న ఇండస్ట్రియలిస్ట్. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉండేవాళ్లం... నాకు ఊహ వచ్చేనాటికి ఈసీఐఎల్ షిఫ్టయ్యాం. అప్పుడు ఈసీఐఎల్ పూర్తిగా ఇండస్ట్రియల్ ఏరియా. ఇప్పుడున్నంత జనాభా లేదు. సెవెంత్ వరకు సఫిల్‌గూడలోని డీఏవీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను. తరువాత దుర్గాబాయి దేశ్‌ముఖ్‌కాలనీకి మారాము. ఇట్లా హైదరాబాద్‌లోని చాలా ప్లేసెస్‌తో అనుబంధం ఏర్పడింది.



డీడీ కాలనీకి దగ్గరగా ఉంటుంది కదా అని... నన్ను దిల్‌సుఖ్‌నగర్‌లోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో జాయిన్ చేశారు. ఎయిత్ నుంచి టెన్త్ వరకు అక్కడే. ఆ ఏరియాలో మొత్తం కాలేజీలే కదా. లైఫ్‌లో అసలు ఫన్ స్టార్ట్ అయ్యింది అక్కడినుంచే. అందుకే ఇప్పటికీ ఆ ఏరియా అంటే చాలా ఇష్టం.



నా సెవెంత్ క్లాస్‌లో...

అప్పుడప్పుడే ఓషన్ పార్క్ స్టార్ట్ చేశారు. నేను, మా వాచ్‌మెన్ వాళ్లబ్బాయి (నేపాలీ) కలిసి... స్కూల్ డుమ్మా కొట్టి, ఇంట్లో చెప్పకుండా ఓషన్ పార్క్‌కు వెళ్లొచ్చాం. అప్పుడది మాకొక థ్రిల్లింగ్ అడ్వెంచర్. అడ్వెంచర్స్ మీద అప్పుడు మొదలైన ఇంట్రెస్ట్... ఇప్పటికీ వదలలేదు. టీనేజ్ కొచ్చాక... ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో సినిమాలు చూడటం, బైక్‌మీద చక్కర్లు కొట్టడం, ఫ్రెండ్స్, అల్లరి... చాలా సరదాగా గడిచిపోయాయా రోజులు. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో రిలీజైన ప్రతి సినిమా కనీసం ఐదు సార్లు చూసేవాడిని. అందుకే ఆ ఏరియా అంటే ఇప్పటికీ చాలా ఇష్టం.



 సినిమాల్లోకి రాకుంటే...

 సినిమాల్లోకి రాకుండా ఉంటే... నైన్ టు ఫైవ్ జాబ్ అయితే అస్సలు చేసేవాడిని కాదు. రొటీన్‌గా ఉండటం అంటే బోర్. వైల్డ్‌లైఫ్ ట్రావెలింగ్, అడ్వెంచర్ ట్రావెలింగ్ రిలేటెడ్‌గా ఉండేవాడిని. ఇప్పుడు ఫస్ట్ ప్రియారిటీ ఆఫ్కోర్స్ ఫిల్మ్స్... సెకండ్ అంటే నేను చేస్తున్న బిజినెస్ ప్రాజెక్ట్ ‘ది విలేజ్’ గేటెడ్ కమ్యూనిటీ ఫాం హౌసెస్. శంకర్‌పల్లి దగ్గర అన్ని సౌకర్యాలతో అపార్ట్‌మెంట్ ధరలకంటే తక్కువకే అందిస్తున్నా. ప్లేస్ తీసుకుని ఫాం హౌస్ కట్టించుకుంటే... మెయింటెనెన్స్ ఇబ్బంది కూడా ఉంటుంది. అలాంటివేవీ లేని బెస్ట్ ఆపర్చ్యునిటీ ఇది.



 బెస్ట్‌ప్లేస్...

 వేరే రాష్ట్రాలనుంచి వచ్చి బతకాలనుకునేవాళ్లకి బెస్ట్ ప్లేస్ హైదరాబాద్. ఎందుకంటే ఢిల్లీ, ముంబై, బెంగళూరు అన్ని మెట్రోపాలిటన్ సిటీస్‌లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. పైగా ఊపిరి సలపనివ్వకుండా జనం. హైదరాబాద్ పేరుకు సిటీనే అయినా... ప్రేమాభిమానాలు, పలకరింపులు, మంచి చెడు చెప్పే మనుషులు ఇక్కడ అడుగడుగునా ఉంటారు. ఏమీ తెలియని ఓ మనిషి కూడా హైదరాబాద్‌లో బిందాస్‌గా బతికేయొచ్చని గట్టిగా నమ్ముతా. హైదరాబాద్‌ను మించిన ఫ్రెండ్లీ ప్లేస్, బిజినెస్ ప్లేస్ మరొకటి లేదు. ఐ రియల్లీ ఫీల్ ప్రౌడ్ టు బీ ఏ హైదరాబాదీ. పేరెంట్స్ నాకు బర్త్ ఇస్తే... సిటీ నా కెరీర్‌కి బర్త్ ఇచ్చింది.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top