‘వేశ్య, వ్యభిచారం’...

‘వేశ్య, వ్యభిచారం’...


‘వేశ్య, వ్యభిచారం’... సమాజంలో ఈ విషయాలు మాట్లాడటం పెద్ద తప్పుగా, ఆ పదాలు ‘బీప్’ వాడి వినపడనట్లుగా చేయాలనే ప్రయత్నం చేస్తుంటారు. నిజంగా అవి వినకూడని పదాలా! వారి గురించి మాట్లాడటం, వారితో మాట్లాడటం అంత చేయకూడని పనా..? పెద్ద సినిమాల్లో చిన్న సందేశాల గురించి ఏమో కానీ... ‘బీప్’ అనే చిన్న సినిమా ద్వారా చాలా పెద్ద ఆలోచనను మనసుకు హత్తుకునేలా చూపించారు సుదీప్. యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ ‘బీప్’ చిత్రానికి ‘దాసరి షార్ట్‌ఫిలిమ్’ పోటీల్లో రెండో బహుమతి లభించింది.

 

దీని రూపకర్త సుదీప్  

ఈ చిత్ర విశేషాలను పంచుకున్నారు...


 

చెన్నైలో బీటెక్ చేస్తున్నప్పటి నుంచే షార్ట్‌ఫిలిమ్స్ చేసేవాడిని. ఓ చిత్రానికి కాలేజ్‌లో మంచి పేరు వచ్చింది. అదే నాలో నమ్మకాన్ని పెంచింది. బీటెక్ తర్వాత బ్యాంక్ పీఓగా ఉద్యోగం వచ్చింది. కానీ... ఉద్యోగంలో చేరితే నాకిష్టమైన సినిమాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగమా..? సినిమాలా..? నేను మాత్రం రెండోదానికే ఫిక్సయిపోయా. కానీ ఇంట్లోవాళ్లు, మిత్రులు వద్దంటే వద్దన్నారు. మంచి ఉద్యోగాన్ని వద్దనుకొని భవిష్యత్తుపై భరోసా లేని ఫిల్మ్ ఫీల్డ్‌కు వెళ్లడమేమిటని ప్రశ్నించారు. సక్సెస్ కాకపోతే పిచ్చివాడివి అయిపోతావని ఇంకొంతమంది భయపెట్టారు.

 

కానీ... నేను తీసిన ‘బీప్’కు మంచి రెస్పాన్స్  రావడంతో ఇప్పుడందరికీ నా మీద నమ్మకం పెరిగింది. మిత్రుడి ఫేస్‌బుక్ పోస్ట్‌కు ఇన్‌స్పైర్ అయ్యి... ఓ యథార్థ సంఘటన ఆధారంగా దీన్ని రూపొందించాం.  ‘ఐక్లిక్’ సంస్థ, మిత్రులు సహకరించారు. అంతకుముందు ‘వి’ అనే షార్ట్ ఫిలిం చేశా. అది క్రైం థ్రిల్లర్. షార్ట్ ఫిల్మ్స్ కొనసాగిస్తూనే... భవిష్యత్తులో ఓ మంచి ఫీచర్ ఫిల్మ్ తీయాలన్నదే నా ఆకాంక్ష.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top