భయపెట్టే ప్రయత్నం

భయపెట్టే ప్రయత్నం - Sakshi


హారర్ మూవీస్.. చూస్తున్నంత సేపు భయపడుతుంటాం.. కానీ ఆ సినిమాలు  చూడడంలో వచ్చే థ్రిల్లే వేరు. ఫీచర్ ఫిల్మ్స్‌కే పరిమితమైన హారర్ మూవీస్  షార్ట్‌ఫిల్మ్స్‌లోనూ అప్పుడప్పుడూ పలకరిస్తున్నాయి. అలా వచ్చిందే ఫ్లాట్  నంబర్.4. నగరానికి చెందిన నరేష్ తన ఈ హారర్ మూవీతో నెటిజన్లను కాస్త  భయపెట్టారు. ఇంతకీ ఫ్లాట్ నంబర్.4లో ఏముంది?

 

 ఇదీ కథ

 రైల్వే స్టేషన్‌లో ఆటో ఎక్కి తన ఫ్రెండ్ ఇంటికి వస్తుంది ఒక అమ్మాయి. ఫ్రెండ్ డాలీకి ఫోన్ చేస్తే వాచ్‌మన్ దగ్గర ‘ఫ్లాట్ న ం.4’ తాళాలు ఉంటాయి.. తీసుకో అని చెప్తుంది. ఫ్లాట్‌కు వెళ్లి సేదతీరాక ఆపిల్ తింటూ టీవీ చూస్తుంటుందీ అమ్మాయి. అప్పుడు టైం రాత్రి 7 అవుతుంది. ఆ సమయంలో డాలీ ఫోన్ చేసి తను ఇంటికి వచ్చేసరికి రాత్రి 12.30 అవుతుంది అని చెబుతుంది. ఇంతలో తన వెనుక ఎవరో ఉన్నట్లు అనిపించి వెనక్కి చూస్తుంది. కానీ ఎవరు ఉండరు. ఈ సారి వెనక్కి చూసినప్పుడు ఒక ఆకారం కనిపిస్తుంది. ఎటు చూస్తే అటే కనిపించి భయపెడుతుంది. తన ఫ్రెండ్ చనిపోయినట్లు, ఫొటోకు దండ, చనిపోయిన తేదీ ఉండడం, దెయ్యం తనను చంపేస్తున్నట్లుగా భయపడుతుంది. ఆ సమయంలో కాలింగ్ బెల్ మోగడంతో నిద్ర నుంచి లేస్తుంది. ఇంతకీ ఇదంతా ఆమెకు వచ్చిన కలన్న మాట.

 రివ్యూ

 హారర్ మూవీస్‌కు టేకింగ్, మ్యూజిక్ ప్రధానం. ఎక్కువ భయపెట్టేవి ఆ రెండే. ఆ విషయంలో సక్సెస్ అయ్యారు డెరైక్టర్. కెమెరా టేకింగ్, సీన్‌కు సరిపడే మ్యూజిక్ హారర్ ఫీల్ తెచ్చింది. యాక్టింగ్‌కు అంతగా స్కోప్ లేదు. కానీ ఉన్నంతలో బాగుంది. సినిమా ప్రారంభంలో చిత్రం రాం గోపాల్ వర్మకు అంకితం అని ఒక స్లైడ్ వేశారు. దానికి తగినట్లుగానే టేకింగ్‌లో కొంత ఆర్జీవీ మార్క్ క నిపించింది. ఓవరాల్‌గా ఫిల్మ్ బాగుంది. కానీ చూపించినదంతా కేవలం ‘ఊహ’ అని తేల్చేయడ మే కాస్త మైనస్ అనిపిస్తుంది.‘ఫ్లాట్ నం.4’ లోకి వెళ్లాలనుకునేవారికి ఇదిగోండి తాళం.. https://youtube/nRuVFmZbxGU

 

 ఇదంతా అమ్మ చలవే

 నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఎంబీఏ చేశాను. డిగ్రీలో ఉండగానే నటుడిని కావాలని ఉండేది. అవకాశం లేక వెళ్లలేకపోయాను. ఇప్పుడు ఇంటర్‌నెట్ నాకు అవకాశాన్ని కల్పించింది. ఫేస్‌బుక్, యూ ట్యూబ్, చాలా ఈ-బుక్స్ చదివి డెరైక్షన్ నేర్చుకున్నాను. మా అమ్మగారు చాలా సపోర్ట్ చేస్తారు. షార్ట్‌ఫిల్మ్‌కు అయ్యే ఖర్చు అమ్మే ఇస్తారు. 2014లో ఫస్ట్ షార్ట్‌ఫిల్మ్ చేశాను. ఇప్పటికి 4 చేశాను. నా దగ్గర ఇంకో 30 స్క్రిప్టులు రెడీగా ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి చేస్తాను.

 - నరేష్ బాబు, డెరైక్టర్

 

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top