ప్లాన్ టు ఆసీస్!
ఇందులో వింత... కొత్తా ఏమీ లేదు..! బాలీవుడ్ సుందరి అనుష్కాశర్మ ఈసారి న్యూ ఇయర్ స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకుంటోందట. తాజా సినిమా ‘పీకే’ సూపర్ హిట్ జోష్‌లో ఉన్న ఈ భామ... ప్రియుడు విరాట్ కొహ్లీతో ‘కొత్త’ సంబరాలు చేసుకోవాలని ఉబలాటపడుతోందట. అందుకే పార్టీని ఆస్ట్రేలియాకు షిఫ్ట్ చేసిందట. అక్కడ క్రికెట్ టూర్లో బిజీగా ఉన్న విరాట్‌తో ఆ రోజు ఆస్వాదించాలనేది ఈ చిన్నదాని కోరిక. అలాగే ఎడతెరిపి లేని పనిఒత్తిడిలో గడిపిన అనుష్కా కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకోవాలని కూడా అనుకుంటుందట. సో... సెలబ్రేషన్ కమ్ బ్రేక్ కమ్ డేటింగ్. న్యూ ఇయర్లో ఇంత కంటే ఎంజాయ్మెంట్ ఏం కావాలంటారా!