విలన్‌కు ఓకే!

విలన్‌కు ఓకే!


సూపర్‌స్టార్‌గా ఉన్నప్పుడు జైలు గోడలు చూసిన హీరో సంజయ్‌దత్ ఆ తరువాత బాగా మారిపోయినట్టున్నాడు. అప్పుడప్పుడూ బయటకు వచ్చి అందుబాటులో ఉన్న సినిమాలన్నీ చేసేస్తున్న ఇతగాడు... పూర్తిగా రూటు మార్చినట్టున్నాడు. హీరో అవకాశాల కోసం చూడకుండా... వచ్చినవి వచ్చినట్టు ఓకే చేస్తున్నాడు. అగ్నిపథ్‌లో విలన్‌గా చేసిన ఈ బాహుబలి... ఇప్పుడూ అదే బాటలో వెళుతున్నాడు.



కరణ్ మల్హోత్రా తీస్తున్న ‘శుద్ధి’ సినిమాలో విలన్‌గా చేస్తున్నట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది జూలై- ఆగస్టుల్లో ఎర్రవాడ జైలు నుంచి సంజయ్ బయటకు వచ్చే అవకాశాలున్నాయి. వచ్చిన తరువాత ఇదే తొలి చిత్రం అవుతుంది. కరణ్‌జోహార్ దీనికి నిర్మాత. సల్మాన్ హీరో!

 

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top