దుమ్మురేపిన లోబడ్జెట్ సినిమాలు

దుమ్మురేపిన లోబడ్జెట్ సినిమాలు - Sakshi


భారీ బడ్జెట్‌తో  కలెక్షన్లు కొల్లగొట్టవచ్చు అన్న బాలీవుడ్‌ మంత్రం ఇప్పుడు పనిచేయడం లేదు. సినిమాకు హీరో కంటే కథా బలమే ముఖ్యం. ఈ విషయం అనేకసార్లు రుజువైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు బాలీవుడ్లో విడుదలైన చిత్రాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.  జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ మూడు నెలలలో విడుదలైన  పెద్ద హీరోల సినిమాలేవి  పెద్దగా సందడి చేయలేదు.  లో బడ్జెట్‌ సినిమాలు దుమ్ము దులిపాయి.  జరా హట్కే ఫార్మెట్‌ రూపొందించిన సినిమాలు బాక్సాఫీస్‌ బద్ధలు కొట్టాయి.  గొప్ప స్క్రిప్ట్‌ ప్లస్‌  గ్రేట్‌ యాక్టర్స్‌ ప్లస్‌ లో బడ్జెట్‌  ఈజ్‌ ఈక్వల్‌ టూ  న్యూ ఫార్మూలా  ఆఫ్‌ సక్సెస్‌ అంటోంది బాలీవుడ్‌.



 బాక్సాఫీస్‌ బద్ధలు కొట్టిన  ఎన్హెచ్-10  సినిమా బడ్జెట్‌ జస్ట్‌ 14 కోట్ల రూపాయలే.  నాటక రంగానికి చెందిన నీల్‌ భూపాలమ్‌,  అనుష్కా శర్మ ఈ సినిమాలో ఇరగదీశారు.  దానికి ప్రేక్షకులు జై కొట్టారు.



 పగ, ప్రతీకారం చుట్టు తిరిగిన  బద్లాపూర్‌  ప్రేక్షకుల మది దోచుకుంది.  వరుణ్‌  అమాయక  కళ్లు,  రాధికా ఆప్టే బోల్డ్‌ యాక్టింగ్‌  సినిమాను విజయపథాన నిలిపాయి.  ఈ సినిమా సక్సెస్‌ అంతా స్క్రిప్ట్‌ లోనే ఉందని సినీ విమర్శకులు అంటున్నారు‌.  ఇంతకీ బద్లాపూర్‌ బడ్జెట్‌ ఎంతనుకుంటున్నారు? జస్ట్‌ 25 కోట్లు.  దానికి  రెండు రెట్లు  సంపాదించారు నిర్మాతలు.  బహుశా కలెక్షన్స్‌ వర్షం ఇంతగా కురుస్తుందని నిర్మాతలు కూడా ఊహించి ఉండరు.  



 అందమైన హీరో, అందాల ఆరబోత లేకున్నా సక్సెస్‌ సాధించొచ్చని నిరూపించింది దమ్‌ లాగా కే హైస్సా. హరిద్వార్‌, రిషికేశ్‌లో  రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్‌ మన  గీతా సింగ్‌ను పోలి ఉంటుంది.  ఈ చిత్రం చాలా అద్భుతంగా ఉందని బిగ్‌ బీ ట్వీట్‌ కూడా చేశాడంటే, ఆ సినిమా ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.  నైన్టీస్‌ ఫ్లేవర్‌ను తిరిగి గుర్తుకు తెచ్చారని ఆయన కామెంట్‌ కూడా చేశారు.

ఏది ఏమైనా  సినిమా సక్సెస్‌కు కావాల్సింది  బిగ్‌ బడ్జెట్లు - పెద్ద స్టార్లు కాదు.  స్టోరీ మే దమ్‌ రహ్నా అని నిరూపించాయి ఈ సినిమాలు.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top