వికాసపట్నం చేద్దాం

దుండిగల్‌లోని మర్రిలక్ష్మారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రాంగణంలో విద్యార్థులు


కడలి కల్లోలానికి ఆర్కేబీచ్ అందవిహీనం అయింది. సుడిగాలి తాకిడికి యారాడ కొండలు వణికిపోయాయి. ప్రకృతి కాంతను ఒడిలో దాచుకున్న విశాఖపట్నం.. అదే ప్రకృతి కన్నెర్ర చేయడంతో శోక సంద్రమైంది. హుదూద్ తుపాను తీవ్రత విశాఖను కకావికలం చేసింది. ఉప్పెనలా వచ్చిపడిన కష్టం నుంచి విశాఖను ఊరడించేందుకు మా తరం ముందుకురావాలంటోంది విద్యార్థిలోకం. దుండిగల్‌లోని మర్రిలక్ష్మారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు క్యాంపస్ కబుర్లలో.. వైజాగ్ వాసులకు ధైర్యంతో పాటు కర్తవ్యాన్ని నిర్దేశించారు.

 

 శ్రీకాంత్: హుదూద్ తుపాను విశాఖపట్నాన్ని సర్వనాశనం చేసింది. వెరీ బ్యాడ్ న్యూస్. ఇందులో గుడ్ ఏంటంటే.. పెద్ద ఎత్తున ప్రాణనష్టం లేకపోవడం.

 నరేష్: ముందుగానే ఇంటిమేషన్స్ అందాయి కదా! అది బతికించింది.

 అలేఖ్య: ఏం లాభం.. తుపాను తర్వాత శాటిలైట్ పూర్తిగా ధ్వంసమైంది. ఈరోజుల్లో ఫోన్‌కాల్స్ కట్ అయితే దానికిమించిన నరకం ఇంకోటి ఉండదు కదా! ఫుడ్, ఎకామిడేషన్ లేక లక్షలమంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. టీవీల్లో చూసినపుడు చాలా బాధనిపించింది.

 గణేష్‌బాబు: ఓకే తుపాను, వరదలు వచ్చినపుడు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. మళ్లీ కొన్నాళ్లకు మామూలు పరిస్థితులు వస్తాయి. కానీ వందల ఏళ్లనాటి చెట్లు వేళ్లతో సహా నేలకొరిగాయి. విశాఖ తీరాన తిరిగి పచ్చదనం రావాలంటే ఎన్ని ఏళ్లు పడుతుందో !

 శ్రావ్య: నిజమే.. అసలు అంత పెద్ద చెట్లు ఎలా కూలిపోయాయో ఆశ్చర్యం వేస్తుంది. నేలసారం వల్ల అంటున్నారు చాలామంది.

 ఆకాశ్: డెఫినెట్లీ.. ఇసుక నేలలో చెట్లకు, జిగురు నేలలో చెట్లకు చాలా తేడా ఉంటుంది. మన హైదరాబాద్‌లో కూడా చెట్లు త్వరగా కూలిపోతాయి. చిన్న వర్షానికి కూడా చెట్లు రోడ్డుకి అడ్డంగా పడిపోతుంటాయి కదా!

 గణేష్‌బాబు: యా.. వైజాగ్ మ్యాగ్జిమమ్ ఇసుక నేలే. చెట్లు అంత పెద్ద ఎత్తున కూలిపోవడానికి అదీ ఒక కారణం కావొచ్చు.

 కృష్ణ: అవన్నీ పక్కన పెట్టండి.. రాత్రిపూట కరెంట్ ఓ గంట పోతేనే ఏదో ప్రళయం వచ్చినట్టు ఫీలైపోతాం. అలాంటిది అక్కడ ఇప్పటికీ చాలా చోట్ల కరెంటు లేదు. ఎలా ఉంటున్నారో ఏమో..?

 గణేష్‌బాబు: రాబోయే ప్రమాదాలను ముందుగానే కనిపెట్టగల్గుతున్నాం.. కానీ వాటి నుంచి బయటపడలేకపోతున్నాం.

 కృష్ణ: సముద్ర తీర ప్రాంతాల్లో కరెంటు మొత్తం అండర్‌గ్రౌండ్ సిస్టమ్‌లో ఉంటే బెటర్. ఈవెన్ మొబైల్ నెట్‌వర్క్ కూడా అలాగే  ఏర్పాటు చేయాలి.

 శ్రావ్య: అన్నిటికంటే ముఖ్యమైంది ఆకలి. ఆ సమయంలో తిండిలేక చాలామంది ఇబ్బందిపడ్డారు. ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి అక్కడి ప్రభుత్వం ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సింది.

 అలేఖ్య: వైజాగ్‌ని రీబిల్డ్ చేయాలంటే చాలా కష్టం. ఇందులో అందరూ భాగస్వాములు కావాలి.

 శ్రావ్య: ముఖ్యంగా యూత్.

 గణేష్ బాబు: కాలేజీ విద్యార్థులంతా గ్రూపులుగా వెళ్లి రీబిల్డింగ్‌లో పాలుపంచుకోవాలి. ఫేస్‌బుక్‌లను, వాట్సాప్‌లను ఉపయోగించుకుని అందరూ కలిసికట్టుగా పనిచేయాలి.

 శ్రీకాంత్: మిగతా విషయాల సంగతి ఎలా ఉన్నా.. చెట్ల వరకూ బాధ్యత తీసుకుంటే భవిష్యత్తులో కొత్త కష్టాలు రాకుండా ఉంటాయి.

 నరేష్: చెట్లు లేని వాతావరణం చాలా భయంకరంగా ఉంటుంది. వేడి పెరిగిపోతుంది. వడదెబ్బకు జరిగే నష్టాలు చాలా పెద్ద ఎత్తున ఉంటాయి.

 భాగ్యశ్రీ: వైజాగ్ పున ర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఇండియాలో ప్రతి ఒక్కరికీ ఉంది. కాలేజీ యాజమాన్యాలు ప్రోత్సహిస్తే విద్యార్థులు అక్కడికి వెళ్లి చేతనైనంత సాయం చేసి వస్తే బాగుంటుంది.

 అలేఖ్య: కాలేజీల తరఫునే అవసరం లేదు. ఇండివిడ్యువల్‌గా కూడా వెళ్లొచ్చు. అరకులోయ.. వైజాగ్ బీచ్ అంటూ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడానికి వెళ్తుంటారు కదా! ఇప్పుడు కూడా అలాగనుకునే వెళ్లి అక్కడ మనిషికి పది మొక్కలు చొప్పున నాటి వస్తే అదే చాలు.

 ప్రిస్‌క్యూ: ఇతర ప్రాంతాల నుంచి విద్యార్థులు వెళ్లడం ఇప్పుడు చాలా అవసరం. దాంతోపాటు వైజాగ్‌లోని విద్యార్థులు కూడా అక్కడి గ్రామాలకు వెళ్లి ఒక్కో ఊరిలో వెయ్యి మొక్కలు నాటాలి.

 

 భాగ్యశ్రీ: ఈ సందర్భంగా నాతోటి వారికి నేనొకటి చెప్పగలను.. వచ్చేది దీపావళి పండుగ. అబ్బాయిలు బోలెడంత డబ్బు ఖర్చు పెడతారు. ఈ ఏడాదికి క్రాకర్స్ ఖర్చు తగ్గించుకుని సగం డబ్బుని విశాఖ రీబిల్డింగ్‌కు పంపిస్తే మంచిదనుకుంటున్నాను.

 అలేఖ్య: యస్.. ఇప్పుడుకాకపోతే స్టూడెంట్స్ పవర్ ఇంకెప్పుడు చూపించుకుంటాం.

  - భువనేశ్వరి                  

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top