అన్నీ అనుకోకుండానే..

అన్నీ అనుకోకుండానే..


ఎయిర్ హోస్టెస్‌గా అనుకున్న ఉద్యోగం సంపాదించింది. అదే ఉద్యోగం ఆమెను హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ల్యాండ్ అయ్యేలా చేసింది. హిందీ, ఇంగ్లిష్ తప్ప మరో భాషరాని ఈ అమ్మాయి ఇప్పుడు తెలుగులో అదరగొడుతోంది. సినిమా తెరపై నటనతో ప్రేక్షకుల మనసులు దోచుకుంటున్న కెనీష చంద్రన్ ఇటీవల బంజారాహిల్స్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైంది. తన కెరీర్ ముచ్చట్లను సిటీప్లస్‌తో పంచుకుంది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.

- వాంకె శ్రీనివాస్


 

చిన్నప్పటి నుంచి విమానంలో ప్రయాణించాలనే కాదు.. ఫ్లయిట్‌లోనే ఉద్యోగం చేయాలని కోరిక ఉండేది. నేను పుట్టింది కేరళలో అయినా.. పెరిగిందంతా ఢిల్లీలోనే. బీఎస్సీ సైకాలజీ చేశాను. తర్వాత ఎయిర్ హోస్టెస్‌గా ఉద్యోగం వచ్చింది. రెండేళ్ల కిందట డ్యూటీలో ఉండగా.. విమానంలో ఓ ప్రయాణికుడు నన్ను చూసి యూనినార్ బ్రాండ్ అంబాసిడర్‌గా చేస్తావా అని అడిగారు. ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. తర్వాత తేరుకుని ఓకే చెప్పాను. అలా యూనినార్ ప్రచార చిత్రాల్లో నటించాను.

 

చాలా ఇబ్బందిపడ్డా..

యాడ్స్ మూడ్ ఎంజాయ్ చేస్తుండగానే ఒకరోజు అనుకోకుండా టాలీవుడ్ నుంచి ఫోన్ వచ్చింది. గణపతి బప్పా మోరియాలో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. షూటింగ్ మొదట్లో తెలుగు అస్సలు వచ్చేది కాదు. సహ నటులతో మాట్లాడాలంటే చాలా ఇబ్బందిపడ్డా. ఎలాగైనా తెలుగు నేర్చుకోవాలని పట్టుదలతో ప్రయత్నించా. ఇప్పుడు తెలుగులో గలగలా మాట్లాడేస్తున్నా. తాజాగా జగన్నాటకం సినిమాలో కూడా నటించాను. కోలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి.

 

ఓల్డ్ సిటీ చాలా ఇష్టం...

కెరీర్‌పరంగా నాకు లైఫ్‌నిచ్చిన హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. ఇక్కడి ప్రజలు ఆత్మీయంగా పలకరిస్తారు. ఓల్డ్ సిటీలో చక్కర్లు కొట్టడం అంటే భలే సరదా. షూట్స్ లేని సమయాల్లో.. ఫ్రెండ్స్‌తో కలసి పాతబస్తీని చుట్టేస్తుంటా. ఫలక్‌నుమా ప్యాలెస్, చార్మినార్, గోల్కొండ ఫోర్ట్ చూసి ఎంతో మురిసిపోయాను. ఇక దక్కన్ స్పెషల్.. స్పైసీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఢిల్లీకి వెళ్లినప్పుడు మా  పేరెంట్స్ దగ్గర హైదరాబాదీ బిర్యానీ గురించి ఎంతో గొప్పగా చెప్పా. వారు సిటీకి వచ్చినప్పుడు.. బిర్యానీ టేస్ట్ కూడా చూపించాను.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top