లైట్ ఫర్ లైఫ్

లైట్ ఫర్ లైఫ్


తదేకదీక్షతో ప్రమిదకు సొబగులు అద్దుతున్న ఈ చిన్నారి కళ్లలో వేయి దీపాల కాంతులు కనిపిస్తున్నాయి కదూ! ఆ వెలుగులు అమావాస్య నాడు ప్రతి ఇంటికీ పున్నమి వెలుగులు తెస్తాయి. ఈ పండుగ రోజు మనం వెలిగించే ప్రతి ప్రమిద ఓ చిన్నారి భవిష్యత్తులో కాంతులు నింపుతుందంటే.. ఎదిగీ ఎదగని ఓ మనసుకు  భరోసానిస్తుంద ంటే అంతకు మించిన ఆనందం ఏముంటుంది. ఆ స్పెషల్ చిల్డ్రన్ తయారు చేసిన దివ్వెలు హృదయానికి హ త్తుకుంటున్నాయి. ఇంటింటా దీపాల పండుగను కలర్‌ఫుల్ చేస్తున్నాయి.

 

 వయసుకు తగ్గట్టు ఎదగని మనసు వాళ్లను స్పెషల్ కేటగిరీలో చేర్చింది. వాళ్లేం చేసినా సంథింగ్ స్పెషలే. అందుకే ఆ చిన్నారులు మలచిన ప్రమిదలు సిటీవాసుల లోగిళ్లలో కాంతులీనుతున్నాయి. ఈ ‘చిరు’ దీపాల పనితనం కార్పొరేట్ హౌస్‌లను సైతం మెరుపులై ఆకట్టుకుంటున్నాయి. మెంటల్లీ రిటార్టెడ్ పిల్లలు దీపావళి సందర్భంగా డిజైన్ చేస్తున్న ప్రమిదలకు మంచి డిమాండ్ వస్తోంది. ఈ స్పెషల్ చేతులు మలచిన ప్రమిదలను కొని పండుగను సంతోషమయం చేసుకునేందుకు సిటిజన్లు సిద్ధమవుతున్నారు.

 

 కార్పొరేట్ అదిరిం‘దియా’..

 స్పెషల్ చిల్డ్రన్ తీర్చిదిద్దుతున్న వెలుగు నెలవులను అదిరిం‘దియా’ అంటూ కొంటున్నాయి కార్పొరేట్ కంపెనీలు. డెల్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర వంటి పలు కంపెనీలు తమ కార్యాలయాల్లో ఈ వీటినే దీపాలుగా మలుస్తున్నాయి. గొడుగులు, కలశం వంటి విభిన్న రకాల డిజై న్లు.. కార్పొరేట్ మాల్స్‌లోని ప్రమిదలతో పోటీపడుతున్నాయి. వీటి విలువ రూ.10 నుంచి రూ.150 వరకూ పలుకుతున్నాయి.

 

 సంప్రదాయంగా మారింది..

 నగరానికి చెందిన యానిమేషన్ సంస్థ డిక్యు ఎంటర్‌టైన్‌మెంట్ 3 బ్రాంచిల ఉద్యోగులు మా పిల్లలు చేసిన ప్రమిదలనే కొంటున్నారు. దీపావళికి ముందే పిల్లలు దీపాలకు కలర్స్ వేసి, డిజైన్‌లు దిద్ది సిద్ధం చేస్తారు. దియాల తయారీ.. చిన్నారుల్లో క్రియేటివిటీ పెంచడానికి ఎడ్యుకేషన్‌లో భాగంగా ప్రారంభించినా.. ఆ తర్వాత పిల్లల ఆసక్తి, వీటికి వస్తున్న స్పందనతో దీన్నో సంప్రదాయంగా మార్చాం.

 - దుర్గ, స్వయంకృషి సంస్థ నిర్వాహకురాలు

 

 స్పెషల్ మేళా..

 ఈ చిన్నారుల చేతుల్లో ఒక్క ప్రమిదలే కాదు.. వాల్ హ్యాంగింగ్స్, శారీ పెయింటింగ్, వుడెన్ డెకరేటివ్ ఐటమ్స్, కార్ హ్యాంగింగ్స్, డోర్ హ్యాంగింగ్స్, ఫొటో ఫ్రేమ్స్ వంటి ఎన్నో వెరైటీ ఆకృతులు రూపుదిద్దుకుంటున్నాయి.

 

  వీటితో సప్తపర్ణిలో స్టాల్ కూడా ఏర్పాటైంది. నగరంలో స్పెషల్ చిల్డ్రన్ కోసం పని చేస్తున్న పలు స్వచ్ఛంద సంస్థలు వీరిలోని కళాత్మకను వెలికితీస్తున్నాయి. వీరు తయారు చేసిన దివ్వెలను మార్కెట్ చేయగా, వచ్చిన లాభాలను పిల్లల అవసరాలకే వినియోగిస్తున్నాయి. బాగ్‌లింగంపల్లిలోని ‘ఆశయం’ ఆర్గనైజేషన్, ఎల్లారెడ్డిగూడలోని ఆరంభ్ ఆటిజం స్కూల్, తిరుమలగిరిలోని ఎయిర్ లైన్స్ కాలనీ స్వయంకృషి సంస్థలో స్పెషల్ చిల్డ్రన్ అందమైన దివ్వెలను తయారు చేస్తూ.. మన్ననలు అందుకుంటున్నారు.

 - ఎస్.సత్యబాబు

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top