శృంగార సామర్థ్యాన్ని పెంచే ఎర్రచందనం!

ఎర్రచందనం


పురాతన భారతీయ గ్రంథాలలో నిక్షిప్తమై ఉన్న అనేక అంశాలు విదేశీయులు అర్ధం చేసుకున్నంతగా మనవారు అర్ధం చేసుకోలేకపోతున్నారు. అలాగే మనదేశంలో లభించే వనమూలికలకు ఉండే ఔషద గుణాలు కూడా మనవారు పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు. తెలిసినా వాటిని సరైన రీతిలో ఉపయోగించుకోవడంలేదు. ప్రపంచంలోని వృక్ష జాతుల్లో అత్యంత ఖరీదైనది మనదేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలోనే ఉందంటే నమ్మగలరా? నమ్మకం తప్పదు. అదే ఎర్రచందనం వృక్షం. ఈ వృక్షాలు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో అక్కడక్కడా ఉన్నప్పటికీ,  శ్రీవారు నడయాడిన శేషాచలం అడవుల్లో అపారంగా ఉన్నాయి.



ఎర్రచందనాన్ని గృహోపకరణాలకు మాత్రమే వినియోగిస్తారని చాలా మంది అనుకుంటారు. ఇది శృంగార పురషులకు గొప్ప ఔషదమని చాలామందికి తెలియదు. చైనీయులకు, జపాన్ వారికి ఇదంటే ఎంత పిచ్చో! ఎర్రచందనానికి ఔషద గుణాలతోపాటు శృంగార సామర్థ్యాన్ని పెంచే లక్షణం కూడా ఉంది. ఈ విషయం తెలిసిన చాలా మంది విదేశీయులు తమ శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఎర్రచందనం పౌడర్ను వినియోగిస్తున్నారు. ఈ పౌడర్ను రోజుకు  5 గ్రాముల చొప్పున  పాలల్లో గాని, తేనెలో గాని కలుపుకొని పడుకోవడానికి ఒక  గంట ముందు తీసుకొంటే  శరీరంలో లైంగిక హార్మోన్లు ఉత్పత్తి పెరుగి లైంగిక ప్రేరణను ఎక్కువగా కలగజేస్తుందని చెబుతున్నారు.



ఎర్రచందనం గుణాలు తెలిసిన చైనా,జపాన్ వంటి విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు ఎన్ని కోట్ల రూపాయలైనా ఎర్రచందనం కోసం ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు. చైనా, జాపాన్లలో   పెళ్లి జరగాలంటే  ఎర్రచందనం తప్పని సరిగా ఉండవలసిందే.  ఈ దేశాలలొ షామిచాన్ అనే సంగీత వాయిద్యానికి అత్యంత ప్రాదాన్యత వుంది.  పెళ్లిళ్లు చేసుకొనే ముందు యువకులు పెళ్లి కుమార్తెకు తప్పని సరిగా షామిచాక్ అనే వాయిద్య పరికరాన్ని కానుకగా ఇవ్వడం ఈ దేశాలలో  ఆనవాయితీ.



ఈ వాయిద్య పరికరాలను నాణ్యమైన ఎర్రచందనంతోనే  తయారు చేస్తారు. మన దేశంలో పెళ్ళి కుమారులకు కట్నం ఇచ్చినట్లు అక్కడ  పెళ్లి కుమార్తెలకు షామిచాన్ ఇచ్చి తీరతవలసిందే. ఈ వాయిద్య పరికరం తయారు చేయడానికి ఎంతలేదన్నా రెండు లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. ఈ పరికరం తయారి కోసం ఈ దేశాలు ఏటా కనీసం  800 వందల టన్నుల ఎర్రచందనాన్ని దిగుమతి చేసుకుంటుంటాయి. ఈ ఎర్రచందనం అంతా మన దేశం నుంచి అడ్డదారినే దిగువతి చేసుకుంటుంటారు.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top