రాత పోల్చుకో.. రంగం ఎంచుకో..

రాత పోల్చుకో.. రంగం ఎంచుకో..


కెరీర్ ఎంపికలో హ్యాండ్ రైటింగ్ పాత్ర

నప్పే కెరీర్ కోసం గ్రాఫాలజిస్ట్‌తో సంప్రదింపులు

నగరంలో నవ్య ధోరణి


 

టెక్నాలజీ పుణ్యమాని ఉత్తరాలు రాసే అవకాశం లేకపోయింది. కీబోర్డ్ రాకతో చేత్తో రాసే అవసరం తగ్గిపోతుంటే.. చేతిరాతను తరచి చూసే అవసరం మరోవైపు పెరిగిపోతోంది. ఉద్యోగాలు ఇచ్చేవారు మాత్రమే కాదు ఉద్యోగార్థులు సైతం తమ చేతి‘రాత’ను పరీక్షించుకుంటున్నారు. దాని ప్రకారం తల రాతను దిద్దుకుంటున్నారు.  ఇప్పుడు సిటీలో ఈ ధోరణి బాగా పెరిగింది. వివిధ కోర్సుల్లో శిక్షణ తీసుకుంటున్నవారు తమ కెరీర్ కోసం గ్రాఫాలజిస్టులను సంప్రదించి చేతిరాతలో మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు.

 

‘నేనెందుకు పనికొస్తాను?’.. ఈ ప్రశ్న నిరాశతో మాత్రమే కాదు అత్యంత ఆశావహ దృక్పథంతో కూడా వేసుకోవచ్చు. అలా ప్రశ్నించుకున్న తర్వాత, తన శక్తియుక్తులు తరచి చూసుకున్న తర్వాత ‘రంగం’లోకి దూకితే.. ఆ దూకుడుకు అడ్డుండదు. ఇది విజయవంతమైన వ్యక్తుల కథల సాక్షిగా నిరూపితమైన నిజం. కెరీర్ ఎంపికకు ముందుగా తమని తాము తరచి చూసుకుంటున్న వారికి అందుబాటులోకి వచ్చిన మరో మార్గం ‘హ్యాండ్ రైటింగ్ ఎనాలసిస్’.

 

‘అక్షరాలా’ మనమే..

పలకా బలపం నాటి రోజుల తర్వాత రకరకాల మార్పులకు లోనైంది. ఎంతగా అంటే.. సన్నిహితులు మనల్ని గుర్తు పట్టడానికి అదొక మార్గంగా మారిపోయింది. మనకు అంతగా అలవాటైపోయిన చేతిరాత.. అలవోకగా అమరిపోయిందనుకుంటే పొరపాటే అని గ్రాఫాలజీ చెబుతోంది. మన ఆలోచనలు, ప్రవర్తన, మనస్తత్వం.. వీటన్నింటి ప్రతిరూపంగానే రాసే శైలి కూడా ఉంటుందని గ్రాఫాలజిస్ట్‌లు చెబుతున్నారు. మనం ఏ రంగంలో రాణిస్తామో తెలుసుకోవాలంటే మన ఇష్టాఇష్టాలు, శక్తి యుక్తులు తరిచి చూసుకోవడం అవసరమని, అందులో భాగంగా చేతిరాతను సైతం ఎనలైజ్ చేసుకోవాలని వీరు సూచిస్తున్నారు. ఉదాహరణకు కొన్ని రకాల హ్యాండ్ రైటింగ్ స్టైల్స్‌ను చూస్తే..

 

లార్జ్ హ్యాండ్ రైటింగ్


అక్షరాలపై బార్స్ పెద్దగా ఉండడం స్ట్రోక్స్ అన్నీ కనెక్టింగ్‌గా ఉండడం.. ఈ శైలి సెల్ఫ్ ఎస్టీమ్, కాన్ఫిడెన్స్ ఎక్కువని చెబుతుంది. ఉద్యోగం కన్నా స్వేచ్ఛ, స్వతంత్రత ఎక్కువగా ఉండే వ్యాపకాలను ఎంచుకునే మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక పదానికి పదానికి మధ్య తక్కువ స్పేస్ ఉండడం కలుపుగోలు తనానికి చిహ్నం. ఈ ధోరణి సేల్స్ అండ్ మార్కెటింగ్ లేదా సంబంధిత రంగానికి అతికినట్టు సరిపోతుంది.

 

స్మాల్ సైజ్ రైటింగ్


ఈ స్టైల్‌లో అక్షరం మీద చుక్కను రౌండ్ చుడుతుంటారు. అలాగే పదాల్లో స్పష్టత ఎక్కువగా ఉంది. ఇది పలు అంశాలపై ఉన్న క్లారిటీకి చిహ్నం. వీరిది చిన్న చిన్న డిటైల్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా రాసే తరహా. ఈ ‘రాత’ గల వ్యక్తులకు ఫైనాన్షియల్ సంబంధిత రంగాల (అకౌంటెంట్, ఫైనాన్షియల్ అడ్వయిజర్)కు ఉపయుక్తం.

 

యాంగ్యులర్ రైటింగ్

ఈ తరహా రైటింగ్ చివర్లన్నీ సూదిగా ఉంటాయి. ఇది ఇంటిలిజెన్స్‌కి చిహ్నం. అక్షరాలన్నీ ఒక్కోటి ఒక్కో యాంగిల్‌లా ఉంటాయి. అంటే వీరు లాజికల్‌గా ఆలోచిస్తారు. ప్రతి అక్షరానికి ముందు స్టార్టింగ్ స్ట్రోక్ ఉంటుంది. ఇది వాదనా పటిమకు, వేగంగా నేర్చుకునే తత్వానికి సూచిక. ప్రతి అక్షరానికీ ముందు తోక తగిలించడాన్ని చూశారా.. ఇది పరిశోధనాత్మక ఆలోచనా ధోరణిని సూచిస్తుంది. అడ్వకేట్స్, లీగల్, డిటెక్టివ్ తదితర రంగాల్లో రాణిస్తారు.

 

రౌండ్ రైటింగ్

రైటింగ్ సైజ్ పెద్దగా ఉంది. మంచి శ్రోతలవుతారు. కొన్ని అక్షరాలు కలిపి, కొన్ని విడివిడిగా ఉంటాయి. అంటే ఎడాప్టబులిటీ, ఫ్లెక్సిబులిటీలని సూచిస్తుంది. పదాల మధ్య ఈక్వెల్ స్పేస్ ఇచ్చారు. అంటే, వీళ్లు వెల్ బ్యాలెన్స్‌డ్ థింకింగ్ గలవారు. టీచర్స్, కౌన్సిలర్స్, సోషల్ వర్క్, అడ్మినిస్ట్రేషన్ వంటి రంగాలు వీరికి నప్పుతాయి.

 

షార్ప్ టాల్ హ్యాండ్ రైటింగ్

అడుగున ఉన్న అక్షరాలు పొడవుగా వెళతాయి. ప్రతి పదం చివర్లో, మొదటి అక్షరమో తోకలు కింద లైన్‌లోకి వెళ్లిపోయేంతగా పొడవుగా ఉంటాయి. వీరికి ఇన్నర్ స్టామినా, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎక్కువ. షార్ప్‌గా ఉంటారు. స్పోర్ట్స్‌కి, అవుట్ డోర్ యాక్టివిటీస్‌కి నప్పుతారు. ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణిస్తారు.

 

సంతకం చెప్పే సంగతులు..

- చేతిరాత విశ్లేషణ ద్వారా మన శక్తియుక్తులు ఎలా తెలుస్తాయో.. సంతకం చేసే శైలిని బట్టి.. మన  మనస్తత్వాన్ని విశ్లేషించుకోవచ్చని చెబుతున్నారు గ్రాఫాలజిస్ట్, డాక్టర్ రణధీర్ కుమార్.

ఎడమ నుంచి కుడివైపునకు వెళుతున్నట్టుండేది, అలాగే పైనుంచి కిందకు, కింద నుంచి పైకి వెళ్తున్నన్నట్టుగా ఉండేలా అక్షరాలు రాసేవారు పైకి గంభీరంగా, రిజర్వ్‌డ్‌గా ఉన్నప్పటికీ చాలా సహృదయులై ఉంటారు.

- సంతకంలో అక్షరాలు పెద్దగా ఉంటే ఆ వ్యక్తికి ఇగో ఎక్కువని, తాను చెప్పింది ఇతరులు అంగీకరించి తీరాల్సిందేనన్న తత్వం గలవారని అర్థం చేసుకోవచ్చు. చేతిరాత కంటే సంతకం చిన్నగా ఉంటే ఆ వ్యక్తి తనను తాను ప్రాధాన్యత లేనివాడిగా భావించే గుణం ఉందని.

- సంతకం అర్థం కాకుండా, చదివే వీలు లేకుండా ఉంటే.. ఆ వ్యక్తులు తమ విషయం ప్రపంచం ఎక్కువగా తెలుసుకోకూడదని కోరుకుంటారు. తన గురించి చెప్పేందుకు ఇష్టం లేని దాపరికం ఉన్న వ్యక్తి కూడా అయి ఉంటారు. సంతకం మరీ కాంప్లికేటెడ్‌గా ఉంటే ఇతరులకు తనో రహస్యం కావాలనుకుంటున్నట్టు.  

- సంతకంలోని చివరి స్ట్రోక్ (అక్షరం) వెనుకడుగు వేసినట్టుగా అంటే.. ప్రారంభించిన చోటుకి తిరిగి వచ్చినట్టుగా  ఉంటే అది తనను తాను పాడు చేసుకునే తత్వానికి నిదర్శనం.

- పొడవైన కింద నుంచి పైకి వెళ్లే రైజింగ్ లైన్‌తో ఉన్న సంతకం... రగిలే ఆశలు, ఆశయాలతో ఉన్న మనస్తత్వానికి గుర్తు.

- రెండు సార్ల కంటే ఎక్కువగా అండర్ స్కోర్ చేసిన సంతకం రాజీపడని, ధృఢమైన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది.

- సంతకం కింద వ త్తిపట్టి అండర్‌స్కోర్ చేస్తే అది స్వార్థ మనస్తత్వం, గుర్తింపు కోసం పడే ఆరాటానికి గుర్తు.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top