సాహసం చేయరా..

సాహసం చేయరా.. - Sakshi


ఇప్పటికే సిటీలో రాక్‌థాన్, ట్రెక్కింగ్ వంటి ఈవెంట్లు ఎగ్జయిట్‌మెంట్‌కు వేదికగా నిలుస్తూనే ఉన్నాయి. ఇదే కాన్సెప్ట్‌ను విహారయాత్రలకు ఫిక్స్ చేసింది తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్. అడ్వెంచర్ టూరిజాన్ని పరిచయం చేస్తామంటూ.. పర్యాటక ప్రియుల్లో కొత్త ఆలోచనలను రేకెత్తిస్తోంది. అడ్వెంచర్లు చేయడం కోసం పడమటి కనుమల్లోనో.. హిమాలయ పర్వతాల్లోనో.. చక్కర్లు కొట్టాల్సిన పనిలేదు. మీరు అడ్వెంచర్ చేయాలనుకుంటే మన సిటీకి కూతవేటు దూరంలోనే

 బోలెడన్ని స్పాట్స్ ఉన్నాయి.

     

భువనగిరి, అనంతగిరి కొండలు.. సాహసవీరులకు వెల్‌కమ్ చెబుతున్నాయి. దాదాపు వెయ్యి మీటర్ల ఎత్తున్న ఈ కొండలను తొందర్లోనే రాక్ క్లైంబింగ్ స్పాట్స్‌గా తీర్చిదిద్దనున్నారు.

     

భారీ కొండలు, గుట్టలున్న ప్రాంతాల్లో పారాగ్లైడింగ్, ర్యాపెలింగ్ వంటి ఈవెంట్లకు వేదికగా మలుస్తున్నారు.

     

ఇక తెలంగాణలో పేరెన్నికగన్న లోయర్ మానేర్ డ్యామ్, పాకాల, రామప్ప చెరువులు, కడెం ప్రాజెక్ట్ తదితర జలాశయాల దగ్గర స్పీడ్ బోటింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్ కూడాఅందుబాటులో తెస్తామంటున్నారు. మొత్తానికి టూరిజం డిపార్ట్‌మెంట్ ప్రకటించిన ఈ ఎగ్జయిటింగ్ ఆఫర్లు అమల్లోకి వస్తే.. సిటీవాసులు అడ్వెంచర్స్‌ను మస్తుగా ఎంజాయ్ చేసేయొచ్చు.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top