కుర్రకారు

కుర్రకారు


కారు.. నాడది స్టేటస్ సింబల్. నేటి మెట్రో లైఫ్‌స్టైల్‌లో కొందరికది నీడ్! అయితే, ఏదో బ్రాండ్.. ఒక కారుంటే చాలు అనుకునే జనరేషన్ కాదిది. ఈతరం యువత.. తమకెలాంటి కారు కావాలో పేరెంట్స్‌కి చెబుతోంది. లగ్జరీయస్ కార్లకు ఓటేయిస్తోంది. సో.. కార్ల యూసేజ్ ఏజ్ గ్రూప్ మారి సేల్స్‌కు అమాంతం బూమ్ వచ్చింది.

- హనుమా


పదిపన్నెండేళ్ల కిందటి రోజులతో పోలిస్తే ఇప్పటి జనరేషన్ ఆలోచనా ధోరణి మారింది.



అప్పట్లో యాభై ఏళ్లు పైబడిన వారు అత్యధికంగా కార్లు కొనేవారు. పైగా ఎటువంటి కారు కావాలో ఇంటి పెద్దే నిర్ణయించే వారు. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తి భిన్నం. ఐటీ, ఇతర ప్రైవేటు ఉద్యోగావకాశాల వల్ల ఇన్‌కమ్ లెవల్స్ భారీగా పెరిగాయి. చిన్న వయసులోనే డబ్బు సంపాదిస్తుండటం, బాధ్యతలు, ఖర్చులు పెద్దగా లేకపోవడం వల్ల స్వేచ్ఛగా విలాసవంతమైన అవసరాలపై ఖర్చు పెడుతున్నారు. అందుబాటులో ఉన్న లగ్జరీస్‌ను ఆస్వాదించాలనే ధోరణి, చూసేవారికి డాబుగా కనిపించాలనే తపన, ఈజీ ఈఎంఐలు, రుణ సౌకర్యాలు... ఇవే కార్లపై యువత మనసు పారేసుకొనేలా చేస్తున్నాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం కార్లు కొనే ఏజ్ గ్రూప్ ఎక్కువగా 28-48 ఏళ్ల మధ్య ఉంటోంది.

 

ఫీచర్ రిచ్..

లైఫ్‌లో భాగమైపోయిన గాడ్జెట్స్ వంటివే కార్లలో కోరుకొంటున్నారు. కొనుగోలుదారుల్లో ఎక్కువ కుర్రాళ్లే ఉండటం వల్ల ఇలా ఫ్యూచర్ రిచ్ కార్లకు క్రేజ్ పెరిగింది. ఇదివరకు రేడియో, టేపురికార్డర్ ఉంటే చాలనుకొనేవారు. ‘ఇప్పుడు ఎల్‌ఈడీ, యూఎస్‌బీ డ్రైవ్, వైఫై, టచ్‌స్క్రీన్, ఇంటిగ్రేటెడ్ స్పీకర్స్.. ఇలా కార్లలో కూడా టెక్నాలజీ కోరుకొంటున్నారు. అలాగే అన్నీ అందుబాటులో ఉండాలి. అంటే.. ఏరోప్లేన్ కాక్‌పిట్‌లో పెలైట్ చేతికి అన్నీ ఎలా చేరువలో ఉంటాయో అలా!



ఆడియో కంట్రోల్ స్టీరింగ్ వీల్‌పై కావాలి. పవర్ విండోస్, డోర్స్ లాక్, ఆటోమేటిక్ ఫోల్డింగ్ మిర్రర్స్.. ఇలా అన్ని ఫీచర్సూ ఉండాలి. అవి చేతికి అందాలి. సేమ్‌టైమ్.. స్టైలిష్‌గా, రిచ్‌గా, విభిన్నంగా, వినూత్నంగా ఉండే డ్యాష్‌బోర్డ్స్ ప్రిఫర్ చేస్తున్నారు’ అని చెబుతున్నారు బేగంపేట్ వరుణ్ మోటర్స్ షోరూమ్ డెరైక్టర్ డీకే రాజు.

 

మైలేజ్ ఇంపార్టెన్స్..

ఇండియన్ మార్కెట్‌లో మైలేజీకే అధిక ప్రాధాన్యం. అలాగని పికప్ తగ్గకూడదు. సో.. బిగ్గర్ కార్.. స్మాలర్ సీసీ. అమెరికా వంటి దేశాల్లోనూ ఇదే పాలసీ. ఉదాహరణకు సియాజ్, డిజైర్ వంటి వాటిల్లో ఇంజిన్ కెపాసిటీ తక్కువ. కానీ 1.3 లీటర్ ఇంజినే అయినా అందులో విపరీతమైన పవర్ జనరేట్ అవుతుంది. 115 వీహెచ్‌పీ. ఆర్పీఎం ఎక్కువగా ఉంటుంది. టర్బో చార్జర్ల వల్ల పికప్ బాగుంటుంది. ఇప్పటి ట్రెండ్, యంగ్ జనరేషన్‌ను ఆకట్టుకోవాలంటే ఇలాంటివన్నీ మ్యానుఫ్యాక్చరర్స్ అందించక తప్పడం లేదు.

 

రియర్ షేప్.. లుక్ డిఫరెంట్..

కారు చూడగానే డిఫరెంట్‌గా, ఆకట్టుకొనేలా ఉండాలి. వెర్నా, హోండా సిటీ వంటి కార్లను గమనిస్తే మస్కులర్ డిజైన్స్ కనిపిస్తాయి. ఇలా గ్రీన్‌లైన్స్‌ను ఇష్టపడుతున్నారు కుర్రకారు. ఫ్రంట్ షేప్‌కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో.. రియర్‌పైనా అంతే ఆసక్తి చూపుతున్నారు. ‘ముందు భాగాన్ని ఏ తయారీదారులైనా పెద్దగా మార్చలేరు.

 

ఏరోడైనమిక్ షేప్‌లో స్లీక్‌గా ఉండాల్సిందే. బ్యాక్ పోర్షన్‌ను మార్చొచ్చు. అదీగాక కారును వెనక నుంచి చూసేవారే ఎక్కువగా ఉంటారు. కారణం... ఆపోజిట్ డెరైక్షన్‌లో అందరి కళ్లూ ట్రాఫిక్‌పైనే ఉంటాయి. సో.. మ్యానుఫ్యాక్చరర్స్ దీనికి ప్రాధాన్యమిస్తున్నారు. యూత్ టేస్ట్‌కు తగ్గట్టుగా స్లీక్ డిజైన్, హ్యుండై ఐ20లా టేల్ ల్యాంప్స్ ఇలా ప్రతిదానిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు’ అంటారు హిమాయత్‌నగర్ లక్ష్మీ హ్యూండయ్ బ్రాంచ్ మేనేజర్ సంజయ్.

 

యావరేజ్ హైట్..

గతంతో పోలిస్తే యావరేజ్ ఇండియన్ హైట్‌లో కూడా మార్పు వచ్చింది. కొంత పొడవు పెరిగింది. దీంతో ‘టాల్‌బాయ్ డిజైన్ షేప్‌డ్’ కార్లను ప్రిఫర్ చేస్తున్నారు. అంటే.. హెడ్, లెగ్ రూమ్స్.. ఏదీ పట్టుకోకుండా కూర్చొని లేవడానికి సులువుగా ఉండాలి. సిటింగ్, డ్రైవింగ్ పోస్టర్స్ బాగుండాలి. ఇక టీ మగ్గులు తొణకకుండా కప్ హోల్డర్స్, మొబైల్ చార్జర్లు, బ్యాక్‌సైడ్ వారికి బెడ్‌ల్యాంప్స్, బ్యాగ్, కోట్ హుక్స్, ముఖ్యమైన, విలువైనవి సీక్రెట్‌గా పెట్టుకోవడానికి సీటు కింద స్టోరేజ్ వంటివన్నీ కామన్ ఫీచర్స్.



సిటీలో హయ్యస్ట్ సెల్లింగ్ కారు డిజైర్. స్టైలిష్‌గా, ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్ ఇందులో ఉంటాయి. తరువాతి కారు స్విఫ్ట్. గతంలో ఆటోగేర్ కార్లు వెయ్యికి ఒకటి అమ్మడం కష్టంగా ఉండేది. ఇప్పుడు సగటున 15-20 శాతం ఈ కార్లు అమ్ముడవుతున్నాయి. కారణం.. మైలేజ్, స్లీక్ మోడల్, ఇంటిగ్రేటెడ్ స్టీరియో వంటి ఫీచర్స్.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top