షెరాన్ ‘స్టోన్’!
అడగంగానే ఒప్పుకుందని ఆనందించే లోపే అది కాస్తా ఆవిరైపోయింది ఇటాలియన్ డెరైక్టర్ పపి అవతికి. తన చిత్రం ‘గోల్డెన్ బాయ్’ కోసం హాలీవుడ్ తార షెరాన్ స్టోన్‌ను సంప్రదించగా... ఆమె ఓకే చెప్పేసిందట. ఆ దెబ్బకు థ్రిల్లయిన అవతికి ఆ కాసేపటికే షాక్..! షెరాన్ మేనేజర్ ఓ పెద్ద డిమాండ్ల లిస్ట్‌తో అతని ముందు ప్రత్యక్షమయ్యాడట. దీనికి షేకైన అవతి... లెక్కకు మించిన డిమాండ్లతో షెరాన్ తనను ఇబ్బందులు పెడుతుందంటూ రోడ్డెక్కాడు. అయితే... షూటింగ్ స్పాట్లో టీవీల క్రూ చూసిన షెరాన్ వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోయిందనేది సమాచారం.