ఫీచర్ ఫోన్లదే హవా!

ఫీచర్ ఫోన్లదే హవా!


విదేశాలనుంచి దిగుమతి చేసుకునే స్మార్ట్ ఫోన్ల విక్రయాలు భారత్‌లో బాగా తగ్గుతున్నాయి. దేశీయంగా మొబైల్‌ కంపెనీలు తక్కువ ధరకే స్మార్ట్‌ ఫోన్లను విక్రయించడమే ఇందుకు కారణంగా కనపడుతోంది.  ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో త్వరిత గతిన విస్తరిస్తున్న స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ ఇండియాలో మాత్రం తగ్గుతోంది.  ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో మూడంకెల వృద్ధిని సాధించిన ఇండియా, రెండో త్రైమాసికంలో మాత్రం  84 శాతం  వృద్ధి నమోదు చేసింది.   రెండో త్రైమాసికంలోకోటి 84 లక్షల ఫోన్లు భారత్‌కు దిగుమతి అయ్యాయని ఐడిసి అనే రీసర్చ్‌ సంస్ధ తెలిపింది.  అదే జనవరి-మార్చి త్రైమాసికంలో మాత్రం స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు 186 శాతం పెరిగి కోటి 76 లక్షలుగా నమోదయ్యాయి. ఇందులో కొరియాకు చెందిన శాంసంగ్‌ 29 శాతం వాటాతో స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో అగ్రగామిగా నిలిచింది.  18 శాతంతో మైక్రోమాక్స్‌, ఎనిమిది శాతంతో కార్బన్‌, ఆరు శాతంతో లవా తదుపరి స్థానాల్లో ఉన్నాయి.



ఫీచర్‌ ఫోన్ల మార్కెట్‌ ఇప్పటికీ 71 శాతం ఉన్నందు వల్ల దేశంలో స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ వృద్ధికి అవకాశాలు హెచ్చుగా ఉన్నట్టు ఆ సంస్థ తన నివేదికలో తెలిపింది. ఇక బ్రాండెడ్‌ స్మార్ట్‌ ఫోన్‌ దిగుమతులుపై చైనా నుంచి వచ్చే హ్యాండ్‌సెట్స్‌ భారీగా దెబ్బేస్తున్నాయి.   అదీకాక మోజిల్లా లాంటి కంపెనీలు దిగువ స్థాయి మార్కెట్‌ టార్గెట్‌గా హ్యాండ్‌సెట్లు విడుదల చేయనుండడం వల్ల రానున్న రోజుల్లో దేశీయ కంపెనీల స్మార్ట్‌ ఫోన్‌ విక్రయాలు పెరగనున్నాయి.  మొత్తం మీద దేశీయ స్మార్ట్ ఫోన్‌ దెబ్బకు విదేశీ బ్రాండ్స్‌ కాస్త వెనక్కి తగ్గే అవకాశం ఉంది. 

**

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top