ఔత్సాహికులకు గైడ్

ఔత్సాహికులకు గైడ్


తపన, పట్టుదల, కార్యదీక్ష ఉంటే తాను ఎంచుకున్న రంగంలో రాణించవచ్చు. నలుగురికీ స్ఫూర్తిదాయకంగా నిలవవచ్చు. అందుకు పుష్పా భాస్కర్ చక్కటి నిదర్శనం. ఆసక్తి తప్ప ఏమాత్రం అవగాహన లేకున్నా మీడియాలోకి వచ్చారు. ఆర్‌జేగా, రైటర్‌గా, ఆపై ట్రెయినర్‌గా మంచి ప్రావీణ్యం సంపాదించారు. షార్ట్ ఫిలింస్ తీసేవారికి గైడ్‌గా నిలిచారు. పుష్పాభాస్కర్‌తో ‘సిటీప్లస్’ ముచ్చట్లు...  

 

 పదేళ్ల క్రితం హౌస్‌వైఫ్‌గా ఉన్నప్పుడు మీడియాలోకి రావాలని, ఏదో చెయ్యాలని చాలా ఆసక్తిగా ఉండేది. అప్పుడు ఎలా రావాలో, వచ్చి ఏం చెయ్యాలో తెలియదు. అనుకోకుండా నాకు జపా 4 అనే రేడియో షోలో అవకాశం వచ్చింది. తరువాత ఆలిండియా రేడియో ఎఫ్‌ఎంలో ఆర్‌జేగా, టీవీ షోస్‌కి రైటర్‌గా, సీనియర్ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్‌గా, ఆర్‌జే, టీవీ యాంకర్లకి ట్రెయినర్‌గా చేశా. ప్రస్తుతం అన్నపూర్ణ వారి ఫిలిం స్కూల్ - ఏఐఎస్‌ఎఫ్‌ఎంలో యాక్టింగ్ కోర్స్‌కి ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. సినిమా అంటే ప్యాషన్ ఉన్న చాలామందికి బ్యాకింగ్ లేక ముందుకు ఎలా వెళ్లాలో తెలియక అవస్థలు పడుతున్నారు. ఈ మధ్య కాలంలో అలాంటి వారి కోసమే అన్నట్టు షార్ట్‌ఫిలింస్ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది.



చేతిలో కెమెరా, జేబులో కాస్త పాకెట్ మనీ ఉంటే ప్రతీ యంగ్‌స్టర్ ఒక షార్ట్‌ఫిలిం తియ్యడం ఈజీ అయింది. కాకపోతే అంతా యూత్ కావటంతో మూస కథలు, అమ్మాయి, అబ్బాయిల ప్రేమ, బ్రేకప్.. ఈ కథలే. వీటిపై నిరాసక్తి కలిగే అవకాశం ఉంది. కథ ఎంచుకునే విధానం నుంచి దాన్ని ఫైనల్ ప్రొడక్ట్‌కి మార్చే వరకు కొత్తదనం చూపించాలి. షార్ట్‌ఫిలింని ప్రేక్షకురాలిలా చూస్తాను. వారికి ఏవి అర్థం కావో వాటినే డిస్కస్ చేస్తా. లాజిక్‌లోకి అమరకపోతే అవి ఎందుకు అలా వున్నాయని అడిగి తెలుసుకుంటాను. మ్యూజిక్, డైలాగ్స్, కెమెరా గురించి టీచర్‌లా కాకుండా వారి గ్రూప్‌లో ఒకరిగా డిస్కస్ చేస్తా.

 

అంత అనుభవం లేదు...

ఒకరికి సలహాలిచ్చేంత అనుభవం నాకు లేదు. కాని ఒక విషయం, నార్మల్ ప్రేక్షకుడి నుంచి ఒక ప్రొడ్యూసర్ దాకా కట్టిపడేసే సినిమా కథ గురించి ఆలోచిస్తున్నారా.. మీ ఇష్టం కోసం సినిమా తీసుకుంటున్నారా.. అని ఆలోచిస్తే కథలో క్లారిటీ వస్తుంది. మీరు నమ్మిన కొంతమందితో కథ గురించి మాట్లాడండి. అప్పుడు కొన్ని కొత్త కోణాలు తెలుస్తాయి. దాని వల్ల మీకు మరింత క్లారిటీ వస్తుంది.

 

 అమ్మాయి లిఫ్ట్ ఇస్తే

దర్శకత్వం: బి.సంతోష్‌కృష్ణ

 ఒక అమ్మాయి అనుకోకుండా ఒక అబ్బాయికి తన స్కూటీపై లిఫ్ట్ ఇస్తుంది. అతడు తనకు లిఫ్ట్ ఇచ్చిన అమ్మాయితోనే మిస్‌బిహేవ్ చేసి, సైకోలా నటించి ఆమెను ఫూల్ చేయాలనుకుంటాడు. అనుకోని పరిణామానికి అమ్మాయి తత్తరపడినా, ధైర్యం కోల్పోకుండా దెయ్యంలా నటించి ఆ అబ్బాయిని ఫూల్ చేస్తుంది. కాస్తంత హారర్ కలగలిసిన హాస్యచిత్రం ఇది.

 

 నౌ ఏ డేస్ లవ్‌స్టోరీ

 కథ, దర్శకత్వం: రాజు కూరెళ్ల

 ప్రేమ గొప్పదనాన్ని చెప్పేందుకు రాజు కూరెళ్ల రూపొందించిన చిత్రం ఇది. ‘ఎటువంటి స్వార్థం లేనిదే ప్రేమ. నేటి యువతీ యువకుల దృష్టిలో మాత్రం ప్రేమ ఒక వ్యామోహంగా మారింది. ప్రేమించడం తప్పు కాదు కానీ, ఆ ప్రేమను ఎంతమంది పెళ్లి వరకు నిలబెట్టుకుంటున్నారు? ప్రేమ పేరుతో మోసపోయిన వాళ్ల కంటే, ప్రేమ పేరుతో ప్రేమను మోసం చేస్తున్న వాళ్లే ఎక్కువ..’ ఈ విషయాన్ని చెప్పడానికే తాను ఈ షార్ట్ మూవీ  తీశానంటున్నారు రాజు కూరెళ్ల



మేరా మొబైల్ ఘుమ్ గయా

 దర్శకత్వం: ఆర్.కె.సాగర్

 హైదరాబాదీ యువకుడు ఆర్.కె.సాగర్ రూపొందించిన హాస్యభరిత సందేశాత్మక లఘుచిత్రం ఇది. ఇందులో ఒక యువకుడు తన మొబైల్‌ఫోన్ పోగొట్టుకుంటాడు. అందులో కీలకమైన అతడి వ్యక్తిగత సమాచారమంతా ఉంటుంది. ఆ మొబైల్ తిరిగి అతడికి దొరికేలోగానే అందులోని సమాచారమంతా ఇంటర్నెట్ ద్వారా లక్షలాది మందికి చేరుతుంది. మొబైల్‌ఫోన్లను అజాగ్రత్తగా ఉపయోగిస్తే ఎలాంటి అనర్థాలు వాటిల్లుతాయో ఇందులో హాస్యభరితంగా చూపడం విశేషం

 

 ఇండివిడ్యువల్ టాలెంట్‌ను ఎలివేట్ చేసే షార్ట్ ఫిల్మ్‌లంటే ఇప్పుడు యుూత్‌లో యువు క్రేజ్. మీరూ ఇటీవల షార్ట్ ఫిల్మ్‌లు తీసుంటే... వాటి ఫొటోలు, సంక్షిప్తంగా కథ తదితర వివరాలను వూకు పంపండి. వినూత్నంగా...  విలక్షణంగా ఉన్న వాటిని ‘సాక్షి’ పాఠకులకు పరిచయుం చేస్తాం. మెరుుల్ టు sakshicityplus@gmail.com

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top