కామెడీ క్రాకర్

కామెడీ క్రాకర్


స్కూల్ డేస్‌లో పంచ్‌లతో గలగల నవ్వించిన ఓ కుర్రాడు.. తర్వాత నవ్వుల రేడుగా మారాడు. ఇండియన్ స్టాండప్ కమేడియన్ విపుల్ గోయల్ జోకులు పేల్చుతూ సెలబ్రిటీగా మారాడు. కామెడీ ట్రాక్‌పై ఇటీవల హైదరాబాద్ వచ్చిన విదూషకుడు.. హైటెక్‌సిటీలోని ఇనార్బిట్‌మాల్ న్యూస్ కేఫ్‌లో జరిగిన ‘జస్ట్ కిడ్డింగ్’తో నవ్వులు పంచాడు. ముచ్చటగా మూడోసారి సిటీలో కామెడీ క్రాకర్స్ పేల్చిన విపుల్‌తో ‘సిటీప్లస్’ ముచ్చటించింది.

 

 మాది రాజస్థాన్‌లోని ఫల్నా. అక్కడే పుట్టి పెరిగాను. చిన్నప్పటి నుంచే కామెడీ చాలా ఇష్టం. కామెడీ పిక్చర్సే ఎక్కువగా చూసేవాడిని. స్కూల్ డేస్‌లో జోకులు తెగ వేసేవాడిని. టీచర్లను అనుకరిస్తూ సెటైర్లు వేసేవాన్ని. కాలేజ్ డేస్‌కు వచ్చే సరికి కామెడీ యాంగిల్ పీక్ స్థాయికి చేరుకుంది. కాలేజ్‌లో ఏ ఈవెంట్ జరిగినా నా కామెడీ ఉండాల్సిందే. విపుల్ అంటే హాస్యం.. హాస్యం అంటే విపుల్ అని గుర్తొచ్చేలా జోకులు పేల్చేవాణ్ని. ఇండియన్ స్టాండప్  కమేడియన్ రాజు శ్రీవాస్తవ స్ఫూర్తితో టైమింగ్‌పై పట్టు సాధించాను.

 

 ఆరు నెలలు చేశా..

 కాలేజ్ డేస్‌లో సొంత డబ్బు పెట్టుబడిగా హాస్య ప్రదర్శనలు ఇచ్చి.. డబ్బు సంపాదించి చదువుకునేవాన్ని.

 

  ముంబై ఐఐటీలో

 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాను. తర్వాత ఓ ఆరు నెలలు అడ్వెంటిటీ ఐఎన్‌సీలో రిటైల్ అనలిస్ట్‌గా పనిచేశాను. స్టాండప్ కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ షోలు ఇచ్చేందుకు ఐదుగురు మిత్రులతో కలసి ‘హ్యూమరస్లీ యువర్స్’ మొదలెట్టాను. దేశ, విదేశాల్లో 150 ప్రదర్శనలిచ్చాను. ‘వైరల్’ పేరుతో యూట్యూబ్‌లో పెట్టిన కామెడీ షోలు లక్షలాది లైక్‌లు సాధిస్తున్నాయి.

 

 కెవ్ కామెడీ..

 కాదేదీ కామెడీకి అనర్హం. ప్రతి సబ్జెక్ట్ నుంచి నవ్వు పుట్టించొచ్చు. ఫేస్‌బుక్, ఇంజనీరింగ్, సచిన్ టెండూల్కర్, ఇండియన్ ట్రైన్స్, డేటింగ్, మేనేజ్‌మెంట్, పాలిటిక్స్.. ఇలా విభిన్న అంశాలపై హస్యాన్ని పండించా. టెడెక్స్ టాక్స్, ఎడిన్‌బర్గ్ ఫ్రింజ్ ఫెస్టివల్, మాంట్రియల్ కామెడీ ఫెస్టివల్, టోస్ట్ మాస్టర్స్ ఇంటర్నేషనల్, ఇగ్నైట్ టాక్స్ షోలిచ్చా. నయాట్రెండ్‌కు అనుగుణంగానే మా థీమ్‌లు మార్చుకుంటాం.

 

 గుడ్ రెస్పాన్స్...

 గత మూడేళ్ల నుంచి నాకు హైదరాబాద్‌లో ఇది మూడో ప్రదర్శన. నేను చేసే హస్యానికి హైదరాబాదీల నుంచి మంచి స్పందన వస్తోంది.  నేను చేసే హాస్యానికి వారు కొట్టే చప్పట్లు నాలో మరింత ఉత్సాహన్ని నింపాయి. నేను పేల్చే జోకులు మళ్లీ మళ్లీ వినిపించాలనే మాదిరిగానే...  స్వీట్ సిటీ వంటకాల రుచి మళ్లీమళ్లీ ఆస్వాదించాలని ఉంది.

 - వాంకె శ్రీనివాస్

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top