మాన్‌సూన్.. మ్యాజిక్

మాన్‌సూన్.. మ్యాజిక్


లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అవ్వడంలో సిటీ యువతులు ఎప్పుడూ ముందుంటారు. అదే టైంలో సీజనల్ వేరింగ్  కూడా పక్కాగా ఫాలో అవుతున్నారు. సీజన్‌ను కలర్‌ఫుల్‌గా మార్చుకోవడమే కాదు.. కమ్‌ఫర్టబుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రజెంట్ మాన్‌సూన్ జీన్ మబ్బులు, వర్షపు జల్లులతో  వెదర్ డల్‌గా ఉంటుంది. అంతేకాదు చల్లగానూ ఉంటుంది. డల్‌గా ఉండే ఈ సీజన్‌ని గ్రేస్‌ఫుల్‌గా మార్చే టెక్నిక్స్ ఉన్నాయి. అవి తెలుసుకుని ఆచరణలో పెడితే మాన్‌సూన్ మోస్ట్ వండర్‌ఫుల్‌గా మెరిసిపోతుంది. డ్రెస్సింగ్‌లో వండర్ అనే కితాబులు మీకు బోలెడన్ని అందుతాయి.

 

 ప్లెయిన్ ఈజ్ పవర్‌ఫుల్...

 వెదర్ డల్‌గా ఉంది కదా అని చాలామంది పెద్ద పెద్ద ప్రింట్స్ ఉన్నవాటిని సెలక్ట్ చేస్తుంటారు. కానీ ప్లెయిన్ క్లాత్‌తో డిజైన్ చేసిన డ్రెస్సులు ఈ సీజన్‌కి పర్‌ఫెక్ట్‌గా సూటవుతాయి. బ్రైట్ కలర్స్, పేస్టల్ షేడ్స్ ఫ్యాబ్రిక్ తీసుకొని డిజైన్ చేయించుకోవచ్చు. చీరలు సైతం ఇదే తరహాలో ఎంపిక చేసుకోవాలి.

 

 బ్రైట్ వైట్...

 మిమ్మల్ని ఏంజిల్‌లా మెరిపించే రంగు తెలుపు. కానీ వర్షంలో మెయింటెనెన్స్ కష్టం అని పక్కనపెట్టేస్తుంటారంతా. కానీ కొంచెం అలర్ట్‌గా ఉంటే వీటిని ఎంచక్కా ధరించవచ్చు.

 

 లైట్ వెయిట్...

 సింథటిక్, కాటన్స్‌లో లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ డ్రెస్సులనే ఎంచుకోవాలి. ఇవి వానలో తడిసినా త్వరగా ఆరిపోతాయి. కంఫర్ట్‌గా కూడా ఉంటాయి. వీటిపైకి నెక్ కవర్ అయ్యేలా ప్రింటెడ్ స్కార్ఫ్ పర్ఫెక్ట్ మ్యాచింగ్. లైట్‌వెయిట్ ఫ్యాబ్రిక్‌లో ఏవయసువారికైనా ఇట్టే నప్పే మల్ మల్ కాటన్ బెస్ట్ ఆప్షన్. వీటిలోనే బ్రైట్ కలర్, ఫెస్టివల్ షేడ్స్ ఎంచుకోవచ్చు.

 

 చమ్మక్ చుంకీ...

 బంగారు ఆభరణాలను కాస్త పక్కన పెట్టేసి, మిక్స్‌డ్ అండ్ ప్లెయిన్ కలర్స్‌లో ఉండే చుంకీ జ్యూవెలరీ ధరించాలి. ప్లెయిన్ డ్రెస్ ధరించి, ఒక పెద్ద చుంకీ జ్యూవెలరీ వేసుకున్నారంటే ఎక్కడున్నా మీరే స్పెషల్ ఎట్రాక్షన్.

 

 నప్పనివి...

 షిఫాన్, క్రేప్స్, హెవీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఉన్న దుస్తులు ఈ వెదర్‌లో అంత బాగుండవు. అలాగే హెవీ జీన్స్, హెవీ స్కర్ట్స్ ఈ సీజన్‌కి అవాయిడ్ చేయడమే బెస్ట్.

 - అర్చితా నారాయణమ్, ఫ్యాషన్ డిజైనర్

 archithanarayanam@gmail.com

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top