బచ్చా బాలీవుడ్

బచ్చా బాలీవుడ్ - Sakshi


అసలే సమ్మర్.. ఇక పిల్లలకు ఎక్కడ లేని హుషార్.. రొటీన్ ఆటపాటలు.. సమ్మర్ టూర్స్.. వీటి నుంచి కాస్త డిఫరెంట్‌గా  గడపాలనుకునే చిన్నారులకు భలే చాన్స్.. బచ్చా బాలీవుడ్ ప్రోగ్రామ్. వేసవి కానుకగా ఇనార్బిట్ మాల్ జీక్యూ చానల్‌తో కలిసి 17 రోజుల పాటు

 నటనలో శిక్షణనిచ్చేందుకు వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది.



ఇందులో నటన, దర్శకత్వం, స్క్రిప్ట్‌రైటింగ్, డైలాగ్ రైటింగ్, మేకప్, సంగీతం, నృత్యం తదితర అంశాల్లో  శిక్షణనిస్తారు. మే 2 నుంచి 18 వరకు ఈ వర్క్‌షాప్ జరుగుతుంది. 7 నుంచి 15 ఏళ్ల వయసు పిల్లలు అర్హులు. ఇంకో విశేషం ఏమిటంటే.. ఇక్కడ టాలెంట్ చూపిన చిన్నారులతో ఒక షార్ట్‌మూవీని చిత్రీకరిస్తారు.దానిని జీక్యూ చానల్‌తో పాటు టీవీ, సినిమా  థియేటర్లలో ప్రదర్శిస్తారు. సో.. చిన్నారులూ..  గెట్ రెడీ. లైట్స్.. కెమెరా.. యాక్షన్.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top